English | Telugu

సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రారంభ౦

దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంటగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లోని ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8:30 నిమిషాలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితం తెలంగాణలోనే వెల్లడి కానుంది. చార్మినార్ అసెంబ్లీ ఫలితం 13 రౌండ్లలో తేలిపోనుంది. కాబట్టి ఉదయం పది గంటలకే ఈ నియోజకవర్గ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక, సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ ఫలితం 14 రౌండ్లలో పూర్తి కానుంది. దీంతో, చార్మినార్ కానీ, రాజోలు కానీ తొలి ఫలితంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనకాపల్లి ఫలితం మొదట వెల్లడి కానుంది. ఇక్కడ 18 రౌండ్లలో అధికారు లు ఫలితాన్ని వెల్లడించనున్నారు. అదే విధంగా, రాష్ట్రంలోనే అత్యధిక మంది ఓటర్లు, అభ్యర్థులు పోటీ పడిన మల్కాజిగిరి పార్లమెంటు ఫలితం మాత్రం చిట్టచివరన రానుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి అసెంబ్లీ ఫలితం కూడా చివరనే రానుంది. ఈ రెండుచోట్ల 45 రౌండ్లుపాటు ఓట్లను లెక్కించనున్నారు.