English | Telugu

మూడు రాజధానుల‌పై మోదీ మ‌న‌స్సులో మాట‌!

ఏపీ మూడు రాజధానుల అంశం గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా టీడీపీ ఎంపీ రాసిన ఈ లేఖకు మోదీ ప్రత్యేకంగా సమాధానం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులను ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. రాజకీయంగానూ పలువురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత వాసులు గత 90 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ ప్రతిపాదనపై టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు స్పందించిన మోదీ పరిశీలిస్తున్నామంటూ చెప్పడం విశేషం.

అయితే మోదీ స‌మాధానాన్ని అధికార ప్ర‌తిప‌క్షలు ఎవ‌రికి వారు త‌మ‌కు అనుకూలంగా స్పందించార‌ని భావిస్తున్నారు. అస‌లు ప‌రిశీలిస్తున్నామంటే ఏమిటి? పి.ఎం. మోదీ మ‌న‌స్సులో ఏముంది. అది ఎప్ప‌ట్టికి బ‌య‌టికి వ‌స్తుందంటూ అమ‌రావ‌తిలో పోరాటం చేస్తున్న‌ రైతులు అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.