English | Telugu

చైనీస్ వైరస్ అంటున్న‌ ట్రంప్ పై మండిప‌డుతున్న న‌టి లానా కాండోర్‌!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అంటూ చైనాపై తనకున్న అక్కసును ట్రంప్ వెళ్లగక్కారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై నటి లానా కాండోర్ ఘాటుగా స్పందించింది. దేశాల మధ్య చిచ్చుపెట్టే ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలను చేసిన ట్రంప్ ఒక నాయకుడే కాదంటూ మండిప‌డింది. ఒక దేశాధ్యక్షుడి హోదాలో ఉన్నపుడు ఆచి తూచి మాట్లాడాలని కాండోర్ మండిపడింది. అమెరికన్-ఏసియన్లపై ట్రంప్ వ్యాఖ్యలు ఎంతో ప్రభావం చూపుతాయని ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని నాయకుడనరని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చైనా ప్రజలు అభద్రతా భావంలో ఉంటారని చైనా ప్రజలపై దాడి జరిగే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్ సిగ్గుపడాలని చెప్పింది. నాయకుడని పిలుపించుకునే అర్హత ట్రంప్ నకు లేదని - నిజమైన నాయకులు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా లా ఉంటారని గడ్డిపెట్టింది. లక్షల కొద్దీ మాస్క్ లను జాక్ మా అమెరికన్లకు ఇచ్చి తన వంతు సాయం చేశాడని...ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఆపాలని ట్రంప్ నకు హితవు పలికింది.


మరోవైపు ట్రంప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మండిపడింది. వైరస్లకు జాతి - కులాలు తెలియవని - అదేం చైనీస్ వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. వైర‌స్ పై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాటం చేయాలని ర్యాన్ పిలుపునిచ్చారు.