English | Telugu

జగన్ తప్పిదాలే విపక్షానికి ఆయుధాలు...

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న టిడిపి సీఎం ఏదో రూపంలో రాజకీయ ఆయుధాలు అందిస్తున్నారు...మొన్నటి వరకు మూడు రాజధానుల అంశంలో నానా యాగి చేసిన టిడిపికి ఇప్పుడు కరోనా , క్యాస్ట్ ఆయుధాులుగా దొరికాయ...లోకల్ బాడీ ఎన్నికల పుణ్యమా అని అమరావతి ఆందోళనలకు కాసేపు విరామం ప్రకటించిన టిడిపికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా మరో ఆయుధంగా దొరికింది..దీంతో పాటు సీఎం జగన్ కరోనా తో పాటు కమ్యూనిటీ ఏంగిల్ లో చేసిన కామెంట్లు తో టిడిపి నాయకులు రెచ్చిపోతున్నారు...

కరోనా విషయంలో దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్ ఉంది...చాలా దేశాలు గజ గజ వణికిపోతున్నాయి....ఏపీలో పెద్ద ప్రభావం లేదు..దీంతో పాటు ఒక్క పాజిటివ్ కేస్ కూడా లేదు..దీంతో కరోనా పై సీఎం జగన్ లైటర్ వేలో మాట్లాడారు..జస్ట్ పారా సెట్మాల్ బ్లీచింగ్ చాలు అని సీఎం చేసి న వ్యాఖ్యలు టిడపికి వరంగా మారాయి....చంద్రబాబు ఇదే అదనుగా చేసుకుని రెచ్చిపోతున్నారు..రాష్ట్రంలో కరోనా కేస్ ఒక్కటి కూడా లేదే అనే బాధ చంద్రబాబు మాటల్లో వ్యక్తం అవుతోంది అనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తం అవుుతున్నాయి..దీంతో చంద్రబాబుతో సహా టీడిపి నేతలు మరింత రెచ్చిపోతున్నారు...

ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సామాజిక వర్గ కోణంలో సీఎం జగన్ చేసి న కామెంట్ కూడా టిడిపి వర్గాలకు అనుకూలంగా మారింది..ఇప్పటికే ఒక సామాజిక వర్గాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి జనంలోకి తీసు కెళ్లింది. దీనికి కొనసాగింపుగా సాక్షాత్తూ సీఎం జగన్ ఈ రకమైన కామెంట్ చేయడంతో చంద్రబాబు దగ్గర్నుంచి మిగిలిని నాయకులంతా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు....సామాజిక వర్గం కోణం కావడంతో జనంలో కూడా చర్చ జరుగుతోంది...

ఏదో రకంగా రాజకీయంగా నష్టపోయిన టిడిపికి సీఎం జగన్ ఆయుధాలు బాగా అందిస్తున్నారనే చర్చ జరుగుతోంది..కనీసం ఏడాది పాటు మాటా మంతి లేకుండా ఉండాల్సిన పార్టీ విపరీతంగా రెచ్చిపోవడం టిడిపి వర్గాలకు మరింత ఆనందం కలిగిస్తోంది.