English | Telugu

దిశ నిందితుల మృతిదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి...

దిశ నిందితుల మృతిదేహాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు దిశ అత్యాచార నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం ముగిసింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్తా నేతృత్వంలోని నలుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. మృతదేహాలను కుటుంబ సభ్యుల గుర్తించిన తరువాత రీపోస్టుమార్టం మొదలు పెట్టారు. ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉండగా, శివ శరీరంలో మూడు బులెట్ గాయాలు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్ గాయాలు,చెన్నకేశవులు శరీరంలో ఒక బులెట్ గాయాన్ని గుర్తించారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టు మార్టం పూర్తి చేసేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టింది. రిపోస్టుమార్టం అనంతరం నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ,జొల్లు నవీన్ ,చెన్నకేశవుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

భారీ భద్రత మధ్య స్వస్థలాలకు మృతదేహాలను తరలించారు. ఎట్టి పరిస్థితిలో ఇవాళ అంత్యక్రియల పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఐదు లోపు నివేదిక సమర్పించాల్సిందిగా ఇప్పటికే హై కోర్టు ఆదేశించింది. ఈనేపధ్యంలో రీపోస్టుమార్టం వీడియో ప్రక్రియ సీడీ, పెన్ డ్రైవ్ను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. పోస్టుమార్టం మొత్తం వీడియో రికార్డింగ్ జరిగిందనీ మృతదేహాలు 50% కుల్లిపోయాయని అయ్యాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ తెలిపారు.