English | Telugu
ఉరికి వేలాడిన నిర్భయ దోషులు
Updated : Mar 20, 2020
అయితే ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. వివిధ కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు దాఖలు చేసి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ,
ఢిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్పై గురువారం అర్థరాత్రి వరకు వాడీవేడీ వాదనలు జరిగాయి. గురువారం రాత్రి 11.30ల వరకు విచారణ సాగింది. దీంతో హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.
సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జైల్లో శిక్ష అనుభవించాడు.
20వ తేదీ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో నలుగురు దోషులకు ఉరితీశారు.
నలుగురు దోషులను ఉరి తీసినట్లు తిహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయెల్ ధ్రువీకరించారు. ఉదయం 6.00 గంటలు నలుగురు దోషులు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. నలుగురు దోషుల మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.