English | Telugu
నాగబాబు కి హొలీ నాడు రంగు పడింది!
Updated : Mar 10, 2020
తుస్సుమన్న 'బుస్సు' బాబు ట్వీట్ ....
ట్విట్టర్ ఎకౌంట్ ఉంది కదా అని రాసేస్తే, అదేమీ సినిమా కాదు కదా హిట్ అయిపోవటానికి. సరిగ్గా చిరు తమ్ముడు , పవన్ కళ్యాణ్ అన్న అయిన నడిపోడు నాగబాబుకు ఇలాంటి పులుసు కారే వ్యవహారమే మంగళవారం ఎదురైంది. 'లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్లని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు.. ఏమిటో ఈ జనం. దేవుడా ఈ జనాల మనసు మార్చు (ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్)' అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. జనసేనను ఓడించి, వైసీపీని అధికారంలో, టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
నాగబాబు ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'నువ్వు కేక అన్నా', 'కొన్ని జీవితాలు అంతే మారవు' , 'ఈ అలవాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే ఉంది.. ప్లీజ్ మారండి' అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. అయితే, ఆయనకు కాస్తంత ఘాటు ట్వీట్లే సమాధానాలుగా వచ్చాయి. " చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నా గబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ , సా యి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్..... వీళ్ళందరికి లైఫ్ ఇచ్చింది ఎవరు సర్ ఆ జనాలు కదా . PK రాజకీయాల్లో గెలవకపోతే జనాలు మంచోళ్ళు కాదా," అంటూ ఓ ఔత్సాహిక ట్విట్టర్ వీరుడు నాగబాబుని ఉతికి ఆరేశాడు.
మరొక ట్విట్టర్ బాబు అయితే ఏకంగా... " మీ చేతకాని తనాన్ని జనాలపైన ఎందుకు రుద్దుతారు మాష్టారు.... జనసేన గెలిస్తే జనాలు మంచోళ్ళులేకుంటే కాదా ! పట్టుమని నెలలు కూడా కష్టపడలేదు మీరు మీ తమ్ముడు పార్టీ కోసం ఎలక్షన్స్ ముందు. అధికారం తుచ్చమ్ అంటూనే ప్రతి సారి అధికారం కోసం వెంపర్లాడుతారు ," అంటూ సీరియస్ సెటైర్ విసిరాడు. మరొక ట్విట్టర్ రాణి అయితే-" ఒకసారి లైఫ్ ఇస్తాము అని చెప్పి టిక్కెట్ లు అమ్ముకుని సొమ్ము చేసుకుంది మీ ఫ్యామిలీ అందరికీ అర్థం అయిపోయి తరిమి కొట్టేరు రాజకీయాల్లో మీరు పనికిరారు టైం వేస్ట్ చేస్కోకండి..." అంటూ నాగబాబుకు సలహా ఇచ్చింది. ఎదో కష్టాల్లో ఉన్న చిన్న తమ్ముడి కి సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చే ఉద్దేశం తో ట్వీట్ చేస్తే, నెటిజన్లు ఇలా ఆడుకుంటున్నారేమిటని పాపం నాగబాబు దీర్ఘ చింతన లో పడ్డట్టు తెలిసింది. అందుకే అంటారు ఊరుకున్నంత ఉత్తమం లేదు.... బోడిగుండంత సుఖం లేదు అని... నాగబాబు గారూ ...ఈ సామెత ఫాలో అయిపోతే బెటర్ కదా మీరు !