English | Telugu

లాక్‌డౌన్ ప్రకటించిన కియా కార్ల పరిశ్రమ

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పరిశ్రమలన్నీ లాక్‌డౌన్ ప్రకటించుకుంటున్నాయి. ఇందులో భాగంగా కియా కార్ల పరిశ్రమ ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. సెక్యూరిటీ, ఫైర్‌ సిబ్బందికి మినహా అందరికీ కియా యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది.