English | Telugu
ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారట!
Updated : Mar 20, 2020
ఇప్పటి వరకూ ఆ దేశంలో కరోనా కారణంగా 1200 మంది మరణిస్తే.. తాజా లెక్కల ప్రకారం 18400 మంది ప్రజలు కరోనా బారిన పడినట్లుగా ఆ దేశ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా వెలువడుతున్న రిపోర్టుల ప్రకారం ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారని.ఇరాన్ అధికారులు తెలిపారు.
పరిస్థితి ఇంత దారుణంగా వుండటంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు. తమను తాము కాపాడుకోవాటానికి ఇరాన్ ప్రజలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. దర్గాలకు, మతగురువుల సమాధుల వద్దకు వెళ్లి అక్కడి గోడల్ని..గ్రిల్స్ లను నాకుతున్నారు.
ఒకపక్క కరోనా లాలా జలం (ఉమ్మి) నుంచి అత్యంత వేగంగా విస్తరిస్తుందని డాక్టర్లు చెబుతున్నా, పట్టించుకోకుండా ఇరాన్ ప్రజలు చేస్తున్న పిచ్చి పనికి అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.