English | Telugu
కరోనా దూకుడుతో ఏషియన్ అమెరికన్లలో ఆత్మరక్షణ భయం
Updated : Mar 20, 2020
* ఫిబ్రవరి మాసం లో ఒక్క ఎఫ్ బీ ఐ సిస్టం ద్వారా 2. 8 మిలియన్ గన్స్ విక్రయాలు జరిగాయి. ఇది కిందటి ఏడాది ఫిబ్రవరి తో పోలిస్తే, 36 శాతం పెరుగుదల ఉన్నట్టు లెక్కన్న మాట. నిజానికి 2016 తర్వాత, ఇది రికార్డు స్థాయిలో నమోదైన విక్రయాలు అని లెక్కలు చెబుతున్నాయి.
* కరోనా వైరస్ ఔట్ బ్రేక్ తరువాత , గన్స్ సేల్స్ లో 50 శాతం నుంచి 100 శాతం పెరుగుదల చూసినట్టు, కెవిన్ లిమ్ అనే మరో స్టోర్ మేనేజర్ చెపుతున్నారు.
* ఎక్కువగా ఏషియన్-అమెరికన్ కస్టమర్స్ గన్స్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్న దాఖలాలు వాషింగ్టన్ స్టేట్ లో, కాలిఫోర్నియా లో నోటీస్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైనా లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ కారణం గా, ఏసియన్లు టార్గెట్ గా 'జాత్యహంకార దాడుల్లో జరుగుతాయేమోననే భయం తో , ఆసియన్-అమెరికన్లు ఎక్కువగా ఆత్మ రక్షణ సామాగ్రి , రైఫిల్స్ కొనుగోలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి
* లాస్ ఏంజెల్స్ లో గ్రోసరీ స్టోర్స్ లో కన్నా ఎక్కువగా, గన్ షాప్స్ దగ్గరే జనాలు క్యూ కట్టుకుని మరీ నుంచోడం చూస్తుంటే, కరోనా వైరస్ కారణంగా ఉత్పన్నమైన ఆత్మరక్షణ భయం తాలూకు ఛాయలు, అమెరికన్ -ఏసియన్స్ లో కనిపిస్తున్న విషయం బోధపడుతోంది.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెతను ఇక్కడ తిప్పి చదువుకోవాలి. సుబ్బి చావు తో ఎంకి తన పెళ్లి కి సంబారాలు సమకూరుస్తోందనేది ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నడుస్తున్న టాపిక్. ఒక వేళ దేశం లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటిస్తే, ఎక్కడ బ్లాక్స్ నుంచి దాడులు ఎదుర్కోవలసి వస్తోందనే భయంతో, ఆ దేశ పౌరులు ఇప్పుడు, తుపాకులు, తపంచాలు కొనుగోలు దిశగా పరుగులు తీస్తున్నారు.
అమెరికా ఎకానమీ ని కల్లోల పరిచిన కరోనా, దేశంలోని వివిధ వ్యవస్థలను నిర్వీర్వ్య పరిస్తే, ఒక్క గన్స్, రివాల్వర్లు పరిశ్రమ మాత్రం దూసుకుపోతోంది. నిజానికి, కిందటి సోమవారం ఒక్కరోజే పెన్సిల్వేనియా లోని హ్యారిస్ బర్గ్ లోని ఒక గన్ షాప్ 30,000 డాలర్ల మేరకు గన్స్, రివాల్వర్లు విక్రయించినట్టు సమాచారం. ఈ సంగతి అక్కడి స్టాడ్స్ గన్ షాప్ మేనేజర్ కుర్ట్ గ్రీన్ ధృవీకరించారు. ఇది గడిచిన తొమ్మిదేళ్ల అమ్మకాలతోపోలిస్తే, 50 శాతం ఎక్కువ అని అతను చెబుతున్నాడంటే, అక్కడి ప్రజలకు బ్లాక్స్ నుంచి దాడుల భయం ఎంతుందో, సెల్ఫ్ డిఫెన్స్ కు అక్కడ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధం అవుతుంది. వాస్తవానికి, అమెరికా లో 20 శాతానికి పైగా ఆయుధ విక్రయాలు పెరిగాయి. " ఎకానమీ పతనమవుతుంటే, తుపాకుల విక్రయాలు మాత్రం అమాంతం పెరిగాయి," అని ఘంటాపధంగా చెపుతున్న అతని విశ్లేషణ బట్టి చుస్తే, అమెరికా వాసుల కు బ్లాక్స్ నుంచి ఎదురయ్యే దాడులు , ఏ రకంగా ప్రభావితం చేశాయో ఇట్టే అర్ధమవుతోంది.
దేశంలోని గన్ డీలర్స్ అందరూ కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో, ముందస్తుగా గన్స్ బుక్ చేసుకోవలసిన పరిస్థితి కూడా రావచ్చునేమో అని అడ్వెంచర్ ఔట్ డోర్స్ స్టోర్స్ యజమాని ఎరిక్ వాలస్ చెపుతున్నారు. ఆ ఒక్క స్టార్ లోనే కిందటి సోమవారం 500 గన్స్ అమ్ముడయ్యాయి. జార్జియా లోని స్మిర్నా లో ఉన్న ఈ స్టోర్, దేశం లోని అత్యంత పెద్ద స్టోర్. 80,000 చదరపు గజాల విస్తీర్ణం లో ఉన్న ఈ స్టోర్ లో షాట్ గన్స్ , AR -15 సెమీ ఆటొమ్యాటిక్ రైఫిల్స్ , 9 mm హ్యాండ్ గన్స్ మొదలు అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి. ఈ పైన పేర్కొన్న మూడు రకాల గన్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గన్స్ సేల్స్ లో 300 శతం వరకూ ఎదుగుదల కనిపించిందని చెపుతున్న ఎరిక్ వాలస్, అమెరికా పౌరులు హంటింగ్ రైఫిల్స్ కోసం కూడా తమను సంప్రదిస్తున్నట్టు చెప్పాడు. భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయటానికి వస్తున్న కస్టమర్స్ అతనితో ఎక్కువగా షేర్ చేసుకున్న అభిప్రాయమేమిటంటే, ఒక వేళ మార్షల్ లా ప్రకటిస్తే, తమను, తమ నివాసాలను రక్షించుకోవటానికి ఆయుధాలు అవసరమని చెపుతున్నారట. ఆయుధాల సరళీకృత విక్రయ విధానం వల్ల, ఆ దేశం లో పౌరులు తమ వ్యక్తిగత భద్రత కోసం అనివార్యం గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారని మనకు అర్ధం అవుతోంది.
ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఏ క్షణం లోనైనా పూర్తి లాక్ డౌన్ ప్రకటించే అవకాశముందనే వదంతులు వ్యాపించటం వల్ల, ప్రజల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. అయితే, రిపబ్లికన్ సెనెటర్ మార్కో రూబియో మాత్రం, ఆ వదంతులను కొట్టిపారేశారు.