English | Telugu
జనతా కర్ఫ్యూ పర్వవేక్షణ కోసం ఏపి సచివాలయంలో కంట్రోల్ రూమ్
Updated : Mar 21, 2020
ఐ ఏ ఎస్ లు ఎవరు రాజధాని దాటవద్దు: సి ఎం
జనతా కర్ఫ్యూ కార్యాచరణను ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించ నుంది. ఈ రోజు మధ్యాహ్నం రాజధాని లో అందుబాటు లో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా నిత్యావసరాలు , ఇతర వైద్య పరమైన సహాయం కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్లలో , పోలీసు కార్యాలయాలలో హెల్ప్ లైన్ సేవలు అందుబాటు లో ఉంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
అలాగే , ఐ ఏ ఎస్ లు ఎవరూ కూడా ఏ ఆదివారం హెడ్ క్వార్ట్రర్స్ దాటి వెళ్లవద్దని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాలతో అనుసంధానం కోసం సెక్రెటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనీ ముఖ్యమంత్రి ఆదేశాలు జరీ చేశారు. ఈ మొత్తం వ్యవహార పర్వవేక్షణ బాధ్యతను సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు -డాక్టర్ పీ వీ రమేష్ (ముఖ్యమంత్రి కార్యాలయం), పూనమ్ మాలకొండయ్య, ఇంకా జవహర్ రెడ్డి లకు అప్పచెప్పారు.