English | Telugu
రజాకార్ల అజెండా అమలు చేస్తున్న సి.ఎం. కేసీఆర్
Updated : Mar 16, 2020
రజాకార్ల అజెండా అమలు చేస్తున్న సి.ఎం. కేసీఆర్ దేశ ద్రోహి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం దేశ ద్రోహమేనని, అందుకు వెంటనే కేసీఆర్పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిందిపోయి, అసెంబ్లీని రజాకార్ల అజెండా అమలుకు ఉపయోగిస్తారా? అంటూ మండిపడ్డారు. పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసినా చెల్లదని, తీర్మానం చిత్తు కాగితంతో సమానం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అల్లర్లపై మాట్లాడే సీఎంకు భైంసాలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో హిందువుల ఆస్తులు ధ్వంసం చేస్తే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.
నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పై స్వరం పెంచారు. సీఎం కేసీఆర్ తనకు బర్త్ సర్టిఫికెట్ లేదని అంటున్నారని, అలాంటప్పుడు తాను పుట్టిన చోట ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాంటూ కేసీఆర్ గతాన్ని గుర్తు చేశారు.