English | Telugu
అమరావతి రాజధాని నుంచి ఎడ్యుకేషన్ హబ్ గా మారనుందా?
Updated : Dec 21, 2019
ఆంధ్రప్రదేశ్ రాజధాని భవితవ్యాన్ని నిర్దేశించే జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికతో అమరావతికి కోత పడట్టుగానే కన్పిస్తోంది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధి పై ప్రభుత్వానికి నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించింది. ఇందులో కమిటీ సభ్యులు చెప్పిన అంశాలు అనేక ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ అమరావతిలోనే ఉండాలని కమిటీ, శీతాకాల సమావేశాలు, వేసవి సమావేశాలంటూ వేర్వేరు ప్రతిపాదనలు చేసింది. శీతాకాలం సమావేశాలు అమరావతిలో, వేసవి కాల సమవేశాలు విశాఖలో నిర్వహించాలని సూచించింది. దీంతో అమరావతిలో ఉండే అసెంబ్లీ కూడా టెంపరరీనే అన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు కర్నూలుకు తరలిపోనున్న నేపథ్యంలో అమరావతిలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
రాజ్ భవన్, మంత్రుల నివాసాలు, అధికారుల క్వార్టర్స్ కూడా మంగళగిరిలోనే నిర్మించాలని నివేదికలో పేర్కొంది. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్పారు, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని కమిటీ సూచించిందన్నారు. కమిటీ నివేదిక పై ఈ నెల 27 న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని ఖాళీ అవడం ఖాయం అన్న విషయాన్ని మంత్రి బొత్స పరోక్షంగా హింట్ ఇచ్చారని 29 గ్రామాల ప్రజలు అంటుంటారు. అందుకే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ప్రకటించినట్టు సమాచారం. త్వరలో అమరావతి ప్రాంతం ఖాళీ చేయటం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటి క్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కథ ముగిసినట్టేనన్న వాదన ఆ ప్రాంత వాసుల నుంచి బలంగా వినిపిస్తుంది.అక్కడి రైతులు మాత్రం తమకు అన్యాయం చేయవద్దని, మరియు ఉద్యోగులు కూడా తము రాజధాని పరిసర ప్రాంతాలల్లో పిల్లల చదువులు, సొంత నివాసాలను ఏర్పటు చేసుకున్నామని,ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారుసీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.