English | Telugu

వీరికి ఉరి ఎప్పుడు?

రేప్‌ హ‌త్య కేసుల్లో జైళ్ల‌లో విచార‌ణ ఎదుర్కొటున్న 32 వేల 559 మంది

ఆ రాక్ష‌సుల క్ష‌ణికావేశానికి అమ్మాయిలు బ‌లైపోయారు. అవును దిశ మానభంగం, హత్య కేసులో మనమందరం మానసికంగా ఆనందం పొందినా, న్యాయం జరిగిందని అనుకుంటున్నా.... ఏవేవో ప్రశ్నలు మన‌ల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి...

1. ప్రత్యూష కేసు, 2. నిర్భయ కేసు, 3. ఆయేషా మీరా కేసు, 4. ఉన్నవ్ కేసు 5. హాజీపూర్ అంతకుడు శ్రీనివాస్ రెడ్డి. 6. హనుమకొండ లో తొమ్మిది నెలల పాప కేసు. 7. టేకు లక్ష్మి కేసు, 8. జడ్చర్లలో హర్షిని కేసు, 9. వరంగల్ జిల్లాలో మానస కేసు... ఇంకా రాసుకుంటూ పోతే.... ఇంకా .. ఇలా హత్యలు మానభంగాలు చేసి న్యాయ విచారణ పేరుతో జైళ్ల‌ లో పడి పందికొక్కుల్లా మెక్కు తున్న, 32 వేల‌, 559 మంది టైం పాస్ చేస్తూ రోజులు గ‌డుపుతున్నారు.

ఈ విషయాన్ని పోలీస్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని సమాజం చూస్తుండగానే మరి కాల్చి చంపితే... ఇలాంటి దారుణాలు ఆగుతాయా? 2008 డిసెంబర్ లో సజ్జనార్ గారు వరంగల్ జిల్లాలో ముగ్గురు ని కాల్చి చంపారు మళ్లీ 2019 డిసెంబర్లో అలాంటి కేసులోనే నలుగురు యువకులను కాల్చి చంపారు.

(NCRB) నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్ర‌కారం 2012 నుండి 2017 వరకు జరిగిన మానభంగ, హత్య కేసుల సంఖ్య 32 వేల 559. రేప్, హ‌త్య నేరాల కేసులో నిందితులు. ఇంత దారుణానికి పాల్ప‌డిన వీరిని విచార‌ణ పేరుతో జైల్లో పెట్టి పందుల్లా మేపుతున్నారు.

మనదేశంలో చిల్లర దొంగతనం చేసిన వాడిని చితకబాది, పెద్ద పెద్ద బ్యాంకులు లూటీ చేసిన వారిని రాజ మర్యాదలతో ఫ్లైట్ ఎక్కించి తలదాచుకునేలా చేస్తారు మన పాలకులు. హత్య చేసిన సామాన్యుని ఎన్కౌంటర్ చేస్తారు. పొలిటిషియన్స్, బడా వ్యాపారుల బడాబాబుల కొడుకులను మాత్రం భద్రంగా దాచి పెడతారు. ఇది మన దేశ రాజకీయ వ్యవస్థ. సామాన్యుని ఆందోళన పరిచే వ్యవస్థ.

సామాన్యుడికి కష్టమొస్తే న్యాయస్థానంలో న్యాయమే దొరకడం క‌ష్ట‌మే. పోలీస్ స్టేషన్లో విచారణ జరగదు. టీవీ ఛానల్ లో వార్తలు రావు. పొలిటిషన్ ఓదార్పు ఉండవు. ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి. తేడాలెందుకు. అందరం మనుషులమే కదా? మన దేశంలో ప్రియాంక రెడ్డి కి ఒక న్యాయం. ప్రత్యూష, నిర్భయ, అయేషా, మానస, టేకు లక్ష్మి, అశ్వినీ లాంటి పేద బిడ్డలకు ఒక న్యాయమా? ప్రియాంకా రెడ్డి లాగే అందరికీ ఒకే న్యాయం జరగాలన్నదే సగటు మనిషి ఆవేదన!

మానభంగం అత్యాచారం చేసి జైలు న్యాయ విచారణ పేరుతో ఉన్న32 వేల 559 మందికి శిక్ష ఎప్ప‌ట్టి లోపు ప‌డుతుందో? 8 ఏళ్ళ గ‌డిచిన బాధితుల‌కు న్యాయం ల‌భించ‌లేదు. సజ్జనార్ లాంటి అధికారుల‌ను ఆద‌ర్శంగా తీసుకొని పోలీసులే సీన్ రికన్స్ట్రక్షన్ చేయాల‌ని ప్ర‌జ‌లంతా కోరుకుంటున్నారు.