English | Telugu

ఇరాన్‌లో 254 మంది భారతీయులకు కరోనా..!

ఇరాన్‌లో చిక్కుకున్న దాదాపు 254 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో ఆదివారానికి 13,938 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 724 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. విదేశాల్లోని భారతీయుల యోగక్షేమాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ కొత్తగా ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది

254 మంది షియా ముస్లింలు జియార‌త్ ఆధ్యాత్మిక‌యాత్ర కోసం ఇరాన్ వెళ్ళి క‌రోనా బారిన ప‌డిన‌ట్లు కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇరాన్‌లో చిక్కుకున్న వీరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇరాన్‌లో ఈ వైర‌స్ బారిన ప‌డి ఇప్పటి వరకు 724 మంది మరణించారు. ఇరాన్‌కు వెళ్లిన జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలకు చెందిన 1,100 మంది షియా యాత్రికుల బృందంలో 254 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

చైనా తర్వాత ఇటలీ, ఇరాన్‌లో కరోనా వైరస్ మరణాలు, కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.
కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకూ 234 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. వీరిలో 131 మంది విద్యార్థులు, 103 మంది యాత్రికులు ఉన్నారు.

వైరస్ భయంతో విమానాశ్రయాలు, ఓడరేవులను ఇరాన్ మూసివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేసింది. దీంతో అక్కడ దాదాపు 2,000 మంది భారతీయులు చిక్కుకున్నారు.

ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారిని జైసల్మేర్‌లో ఏర్పాటుచేసిన శిబిరానికి తరలించారు. . శిబిరాల్లో ఉన్నవారికి సైనికులు స్వచ్ఛందంగా సేవలు అందజేస్తున్నారు.