English | Telugu
సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత కాఫీడే రూ.2వేల కోట్లు మిస్!
Updated : Mar 16, 2020
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ మృతిపై అనుమానాలు రావడంతో కాఫీడే బోర్డు దర్యాఫ్తు చేపట్టి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. కేఫ్ కాఫీ డేకు చెందిన బ్యాంకు ఖాతాల నుండి దాదాపు రూ.2వేల కోట్లు అదృశ్యమైనట్లు కాఫీడే బోర్డు దర్యాఫ్తు వెల్లడైంది. ఈ నివేదికను త్వరలో బహిర్గతం చేయనునుంది.
వీజీ సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లుగా ఓ లేఖ కూడా వెలుగుచూసింది. తాను నిర్వహించిన ట్రాన్సాక్షన్స్ గురించి బోర్డు, ఆడిటర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు తెలియదని కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ వివాదాస్పదంగా మారడంతో బోర్డు దర్యాఫ్తు చేపట్టింది.
సిద్ధార్థకు చెందిన ఇతర ప్రయివేటు కంపెనీలతో కాఫీ డే జరిపిన ట్రాన్సాక్షన్స్‌ను దాదాపు నెల పాటు పరిశీలించి 100కు పైగా పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్‌లలో రూ.2వేల కోట్ల మేర లెక్కలు తేలలేదు. అయితే అదృశ్యమైన మొత్తం రూ.2500 కోట్లకు పైగా ఉంటుందనే అనుమానాలు రావడంతో ఆదిశగా దర్యాఫ్తు చేస్తున్నారు.
నెలల పాటు దర్యాఫ్తు అనంతరం పెద్ద మొత్తంలో లెక్కలు తేలలేదని గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డేకు, వీజీ సిద్ధార్థకు చెందిన పర్సనల్ బిజినెస్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. డ్రాఫ్ట్‌ను ఫైనలైజ్ చేస్తున్నారు.