English | Telugu
మొన్న అఖిల్, నిన్న నాగార్జున, ఈరోజు విజయ్. పూరీ.. ఏంటీ కన్‌ఫ్యూజన్?
Updated : Mar 17, 2025
తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో బద్రితో మొదలైన పూరి సినిమా ప్రయాణం వరసగా రవితేజ, అక్కినేని నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, గోపీచంద్, నందమూరి బాలకృష్ణ.. ఇలా టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితోనూ కొనసాగింది. వీరిలో కొందరికి మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. అయితే సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ విషయం పూరికి కూడా తెలుసు. అందుకే అతని చేతికి ‘నాట్ పర్మినెంట్’ అనే ట్యాటూ వేయించుకున్నారు. అంటే విజయమైనా, అపజయమైనా, సంతోషమైనా, బాధైనా ఏదీ పర్మినెంట్ కాదు అనేది దాని సారాంశం. తరచూ తన చేతిని చూసుకొని అప్పుడతను ఉన్న పరిస్థితి పర్మినెంట్ కాదని సర్ది చెప్పుకుంటారు పూరి. ప్రస్తుతం అతన్ని అపజయాలు వెంటాడుతున్నాయి. వరసగా పూరి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. ఆమధ్య వచ్చిన చివరి సినిమా డబుల్ ఇస్మార్ట్ పూరిని కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో నెక్స్‌ట్ సినిమా ఎవరితో చెయ్యాలి అనే కన్‌ఫ్యూజన్ అతనిలో మొదలైంది. సినిమా చేసే విషయంలో అతనికి కన్‌ఫ్యూజన్ ఉందో లేదో తెలీదుగానీ, సోషల్ మీడియాలో మాత్రం వరసగా ఎవరో ఒకరి పేరు వినిపిస్తూనే ఉంది.
డబుల్ ఇస్మార్ట్ తర్వాత గోపీచంద్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కినేని అఖిల్ పేరు వినిపించింది. ఆ తర్వాత ఆ పేరు కూడా పక్కకి వెళ్లిపోయి అక్కినేని నాగార్జున పేరు బయటికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ వార్త సర్క్యులేట్ అవుతోంది. ఇప్పుడు అతను కూడా కాదని, కోలీవుడ్ హీరోతో పూరి సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అతను ఎవరో కాదు, విజయ్ సేతుపతి. ఇటీవల పూరి చెన్నయ్ వెళ్లారని, విజయ్ సేతుపతిని కలిసి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నేరేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా ఉంటుందనే సమాచారం కూడా సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం ఇది డిస్కషన్ స్టేజ్‌లో ఉందని, సబ్జెక్ట్ ఓకే అయి, నిర్మాతలు కూడా సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటిస్తారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా విజయ్ సేతుపతితో పూరి సినిమా అనే వార్త మాత్రం బలంగానే వినిపిస్తోంది. అంతేకాదు, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే సమ్‌థింగ్ స్పెషల్‌గానే ఉంటుందని ప్రేక్షకులు, పూరి అభిమానులు భావిస్తున్నారు.