Read more!

English | Telugu

ఫ్రీడమ్ ఫైటర్ సారా!

క్విట్ ఇండియా మూమెంట్లో ఫ్రీడమ్ ఫైటర్ గా నటిస్తున్నారు సారా అలీ ఖాన్. ఈ పాత్రలో నటిస్తున్నందుకు త‌న‌కు  ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.  ఆ పాత్ర ప్రవర్తించే తీరు, ఆ పాత్ర వ్య‌క్త‌ప‌రిచే ధైర్యం చూసి తను ఎంతో నేర్చుకున్నానని అన్నారు సారా. అమెజాన్ ఒరిజినల్ ఫిలిం ఏ వతన్ మీరే వతన్ సినిమాలో సారా ఈ క్యారెక్టర్ చేస్తున్నారు. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. థ్రిల్ల‌ర్   డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. బాంబేలో కళాశాలకు వెళ్లిన ఒక అమ్మాయి ఫ్రీడమ్ ఫైటర్గా ఎలా మారింది? అనే క‌థ‌తో  ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి సారా మాట్లాడుతూ ధర్మాటిక్‌ ఎంటర్టైన్మెంట్ ఇంత మంచి పాత్రకు తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ``కొన్ని సంఘటనలు, కొందరి జీవితాలను తప్పకుండా తెరమీద ఆవిష్కరించాలని ప్రేక్షకులతో పంచుకోవాలని, పెద్ద‌లు పంచిన స్ఫూర్తిని జనాలకు తెలియజేయాలని వారి మనోధైర్యాన్ని... మనోవికాసాన్ని దూర దృష్టిని... ఇప్పటి తరం అర్థం చేసుకోవాలని నేను అనుకుంటాను. అలాంటి ఓ పాత్రలో నటించే అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు సారా.

కన్నన్ అయ్య‌ర్‌ తో పనిచేయడం గురించి.. ``ఆయన చాలా ఫ్యాషనైట్ ఉన్న డైరెక్టర్. ఎమోషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు. ఆయ‌న‌ కథ చెప్పిన తీరులోనే నాకు ఆయన డైరెక్షన్స్ స్కిల్స్ మీద ఒక అవగాహన వచ్చింది. సినిమా చేస్తున్నంతసేపు దాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను`` అని అన్నారు సారా. ఇంతకుముందు చేసిన అన్ని పాత్రల కన్నా ఈ చిత్రంలో చేసిన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని అన్నారు సారా. ఫ్రీడమ్ ఫైటర్ గా నటించిన ఈ సినిమా తన జీవితంలో, తన సినిమా కెరీర్లో చాలా కీల‌క‌మైంది అని అన్నారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా మూమెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది.