Read more!

English | Telugu

సుష్మితా సేన్ తో లలిత్ మోడీ డేటింగ్

బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తో ప్రముఖ వ్యాపారవేత్త, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ డేటింగ్ చేస్తున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ విషయాలను స్వయంగా లలిత్ మోడీనే సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషం.

సుష్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన లలిత్ మోడీ.. "మాల్దీవుల్లో షికార్లు కొట్టి లండన్ కి తిరిగి వచ్చాము. నా బెటర్ హాఫ్ సుష్మితతో కొత్త జీవితం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది." అని ట్వీట్ చేశాడు. సుష్మితను బెటర్ హాఫ్ అని చెప్పడంతో వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందని వార్తలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మరో ట్వీట్ లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు లలిత్ మోడీ. తమకు ఇంకా పెళ్లి కాలేదని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.

అయితే వీరిద్దరికీ ఇప్పటికే ఎంగేజ్ మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారో చూడాలి.