English | Telugu

లెజెండ‌రీ డైరెక్ట‌ర్ విశ్వ‌నాథ్ గురించి మీకు తెలీని నిజాలు!

దిగ్ద‌ర్శ‌కులు కె.వి. రెడ్డి నిర్దేశ‌క‌త్వంలో జూనియ‌ర్ శ్రీ‌రంజ‌ని టైటిల్ రోల్ పోషించిన‌ 'గుణ‌సుంద‌రి క‌థ' (1949) సినిమా నిర్మాణ స‌మ‌యంలో కె. విశ్వ‌నాథ్ మ‌ద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. స‌రిగ్గా ఆ టైమ్‌లోనే ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు 'షావుకారు' సినిమాకు బుక్ అయ్యారు. అంటే వారంతా దాదాపు ఒకేసారి త‌మ కెరీర్‌ను ప్రారంభించార‌న్న మాట‌. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ అయిన బి.ఎన్‌. రెడ్డికి విద్యావంతులైన యువ‌కుల‌ను చేర‌దీసి, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్ష‌ణ ఇచ్చి, ఆ త‌ర్వాత వారిలో టాలెంట్ ఉన్న‌వాళ్ల‌ను త‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోకి తీసుకోవాల‌ని ఉండేది.