English | Telugu

ఆశలన్నీ అడియాశలయ్యాయని ఏడుస్తున్న కృష్ణ.. ఆలోచనలో పడ్డ మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -109 లో.. రెండు రోజుల్లో నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకొని వెళ్ళిపోతానని భవానితో చెప్తుంది కృష్ణ. దానికి భవాని ఒప్పుకుంటుంది. ఇక కృష్ణ తన నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి బాధపతుండగా.. మురారి వెళ్ళి "బాధపడకు కృష్ణ" అని ఓదార్చుతాడు. "నేను ఏం తప్పు చేశాను సర్.. నందు ఆరోగ్యం బాగుపడాలనే కదా నేను చేసింది" అని కృష్ణ చెప్పుకుంటూ బాధపడుతుంది. "నీకు ఆ టాబ్లెట్స్ మీ గౌతమ్ సర్ ఇచ్చాడా? అయితే డైరెక్ట్ గా వెళ్ళి అతడినే నిలదీద్దాం పదా" అని మురారి అనగానే.. నేను టాబ్లెట్స్ ఇచ్చినట్లు ఎవరికి చెప్పొద్దని గౌతమ్ సర్ అన్నాడని మనసులో అనుకొని. వేరొక డాక్టర్ ఇచ్చాడని కృష్ణ చెప్తుంది.

రష్మీకి స్వయంవరం..మరి సుధీర్ ఎక్కడ?

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. సుధీర్ ఉన్నన్ని రోజులు రష్మీకి సుధీర్ కి ఏదో ఉందని గాసిప్స్ వచ్చాయి. ఎప్పుడైతే సుధీర్ షో నుంచి వెళ్లిపోయాడో అప్పుడు ఈ గాసిప్స్ కూడా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మీ ఒంటరిదైపోయింది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద "రష్మీ స్వయంవరం" పేరుతో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ స్వయంవరం ఎవరికీ అన్నట్టుగా చూస్తున్న రష్మీతో  "ఇదంతా ఎందుకో తెలుసా నేను నీకు స్వయంవరం అరేంజ్ చేసాను" అని ఇంద్రజ చెప్పి షాకిచ్చింది...

తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు విశ్వనాధ్ గారిని సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం

ఉగాది సందర్భంగా స్టార్ మాలో పండగ రోజు ప్రసారం కాబోతున్న "మా ఇంటి పండగ" ఈవెంట్ ఎపిసోడ్ కి చెందిన మరో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కొంత భాగం కే.విశ్వనాధ్ గారికి డేడికేట్ చేశారు. ఆయన మూవీస్ లోని సాంగ్స్, డాన్స్ చేసి చూపించారు బుల్లితెర నటులు. "స్వాతిముత్యం" మూవీలో ఎవర్ గ్రీన్ సాంగ్ ఐన "సువ్వి సువ్వి " సాంగ్ కి అవినాష్ కమల్ హాసన్ లా, రాధికా రోల్ లో ప్రియాంక జైన్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ చూసిన గెస్ట్ నాని "లెజెండ్స్ ఉంటారు కానీ లెజెండ్స్ లోకెల్లా లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది కే.విశ్వనాధ్ గారు" అని చెప్పారు. తర్వాత "శుభసంకల్పం" లో మరో అద్భుతమైన సాంగ్ "సీతమ్మ అందాలు" అంటూ బాలాదిత్య, తేజస్విని గౌడ డాన్స్ చేసి చూపించారు. "మన కల్చర్ ని మనం ఈరోజు వరకు గుర్తుపెట్టుకున్నాం అంటే అలాంటి గొప్ప ఫిలిం మేకర్లు అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తున్నారు కాబట్టి" అని అన్నాడు నాని.

బిబి జోడి సెమీఫైనల్‌ ఎపిసోడ్‌లో జోడీల డ్యాన్స్ అదుర్స్!

ప్రతీ శని, ఆదివారాలలో స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. ఈ షో తుదిదశకు చేరుకుంది. ఆదివారం రోజు సెమీఫైనల్‌ జరిగింది. సెమీ ఫైనల్ లో మొదటగా అర్జున్-వాసంతి పర్ఫామ్ చేసారు. వారి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు ఫిధా అయ్యారనే చెప్పాలి. పర్ఫామెన్స్ తర్వాత యాంకర్ శ్రీముఖి ఎలా ఉందని అడుగగా.. తరుణ్ మాస్టర్ బాగుందని చెప్పాడు. మీ పర్ఫామెన్స్ కి నా గుండె నోట్లోకి వచ్చిందని చెప్పుకొచ్చింది సుధ. "నేను ఇప్పుడు కూడా షాక్ లో ఉన్నాను. ఆ సాంగ్ లో‌ పెప్ ఉందా అని‌ డౌట్ వచ్చింది. ఇది పవర్ ప్యాక్ డ్ పర్ఫామెన్స్ కంటే కూడా డేంజర్ ప్యాక్ పర్ఫామెన్స్. సెమీ ఫైనల్ లోనే ఫైనల్ పర్ఫామెన్స్ లా చేసారు" అని రాధ చెప్పుకొచ్చింది.