English | Telugu

లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాలూరు రాజేశ్వ‌ర‌రావు ఏడేళ్లు బెడ్ మీదే ఉన్నారు!

తెలుగు సినిమా సంగీత స్వ‌రూపాన్ని మార్చిన ఘ‌నుడిగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు సంపాదించారు సాలూరు రాజేశ్వ‌ర‌రావు. అనుస‌ర‌ణ‌లూ అనుక‌ర‌ణ‌లూ లేకుండా కొత్త శైలిలో సంగీతాన్ని సృష్టించారు. ఆయ‌న స్వ‌రాలు కూర్చిన 'ఇల్లాలు' చిత్రంలోని పాట‌లు అప్ప‌ట్లో కేవ‌లం తెలుగు ప్రాంతంలోనే కాకుండా మొత్తం ద‌క్షిణాదిలోనే ఓ సంచ‌ల‌నం. మ‌ల్లీశ్వ‌రి, మిస్స‌మ్మ‌, ఇద్ద‌రు మిత్రులు, ఆరాధ‌న‌, డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి, రంగుల రాట్నం, పూల రంగ‌డు, మ‌నుషులంతా ఒక్క‌టే, కురుక్షేత్ర‌ము లాంటి సినిమాల‌కు ఆయ‌న స్వ‌రాలు కూర్చిన పాట‌ల‌ను మ‌ర‌చిపోయేదెవ‌రు!