English | Telugu

రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ రావడంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్!

Publish Date:Feb 4, 2026

  ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కరాలలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad)కి పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు డిప్యూటీ సీఎం పవన్ కి రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.   ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు పవన్ కళ్యాణ్. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.   తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ పురస్కారం రావడం పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మీరు సినిమాల్లో పండించే హాస్యం, చూపించే నటన ఎంతోమందికి స్ఫూర్తి. ఈ పురస్కారం మీకు ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా సరైన గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.   Also Read: మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఇదే!  

Peddi postponed to April release date

Publish Date:Feb 4, 2026

Mega Powerstar Ram Charan and director Buchi Babu Sana are currently working at a rapid pace to complete their highly anticipated sports drama, Peddi. The film has already become a global talking point, particularly with the massive success of the first single, Chikiri Chikiri, which has officially crossed a staggering 200 million views worldwide. While the project was originally locked for a March 26th theatrical debut, recent updates indicate a strategic shift in the schedule. The makers have now decided to push the release date to April 30, 2026. This move is intended to provide the post-production and VFX teams with ample time to refine the cinematic spectacle to the highest standards. By moving to the end of April, the film is perfectly positioned to capitalize on the lucrative summer holiday season, where it is expected to witness a sky-high opening at the box office. The poster released with the new release date showcases that the fun and entertaining character of Ram Charan changes to a more serious and goal oriented person in the movie. It offers a clear projection and transformation of his character that makes the movie a must watch for audiences as the makers have been stating from a long time since the first promotional material release.  Produced on a prestigious scale by Venkata Satish Kilaru, the film features Janhvi Kapoor as the leading lady alongside Kannada superstar Shiva Rajkumar in a pivotal role. With legendary composer AR Rahman steering the musical score, the excitement is building for the upcoming release of the second single. As the new date approaches, fans remain eager to see Ram Charan’s raw and rustic transformation on the big screen. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Jan 31, 2026

(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)   - తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే - చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే? - చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు?   నీ ఎంకమ్మా.. తీస్కో.. పండగ చేసుకో.. రకరకాలుగా ఉంది మాస్టారూ.. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్.. జఫ్ఫా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?.. నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి.. నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రావుగారు.. ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు.    ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి ఈ క్రేజ్ ఉండేది.    నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1956 ఫిబ్రవరి 1న  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం.    చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది.  అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి.    ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.

సినిమా బ్లాక్‌బస్టర్.. కానీ, హీరో నథింగ్.. విలనే హీరో అయ్యాడు!

Publish Date:Feb 2, 2026

ఏ కమర్షియల్ సినిమాలోనైనా ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. వారిద్దరి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్ ప్రధానంగా సినిమా నడుస్తుంది. సినిమా మొదట్లో విలన్ ఎన్ని ఎత్తులు వేసినా, హీరోని ఎంత ఇబ్బంది పెట్టినా ఫైనల్‌గా హీరో చేతుల్లో తన్నులు తినడమో, ఓడిపోవడమో జరుగుతుంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఫార్ములా మన సినిమాల్లో కనిపిస్తోంది.    ఒకప్ప్పుడు సినిమాలో హీరోకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. హీరో తర్వాతే ఎవరైనా అన్నట్టుగా సినిమాలు ఉండేవి. అయితే ట్రెండ్ మారుతున్న కొద్దీ కథల్లో, హీరోల క్యారెక్టరైజేషన్‌లో, విలన్ క్యారెక్టరైజేషన్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక విధంగా విలన్‌కి ప్రాధాన్యం పెరిగింది. అతని పాత్రను పవర్‌ఫుల్‌గా చూపిస్తేనే హీరో మరింత ఎలివేట్ అవుతాడనే భావం మన డైరెక్టర్లలో బలంగా కనిపిస్తోంది. అలా చేసిన కొన్ని సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి కూడా.    గత డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధ‌ర్‌’ చిత్రం... పైన చెప్పిన విషయాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరో. ఒక రస్టిక్ లుక్‌లో సీక్రెట్ ఏజెంట్ పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అతని కంటే విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నాకే పెర్‌ఫార్మెన్స్ పరంగా ఎక్కువ మార్కులు గ‌మ‌నార్హం. ఇప్ప్పుడిది చర్చనీయాంశంగా మారింది. అక్షయ్ స్క్రీన్ ప్రజెన్స్, విలనిజం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, సోషల్ మీడియాలో అక్షయ్ ఖన్నానే హైలైట్ చేస్తున్నారు.    ‘దురంధ‌ర్‌’ చిత్రానికి వస్తున్న ఈ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే ఒక సినిమా హిట్ అయినా, బ్లాక్‌బస్టర్ అయినా హీరో ఒక్కడినే హైలైట్ చెయ్యడం లేదని, సినిమాలో హీరోతోపాటు ఇతర పాత్రల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని అర్థమవుతోంది. అవసరమైతే ఆ పాత్రలు పోషించిన వారిని హైలైట్ చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఒకప్ప్పుడు హీరోలు ఆ పాత్రలకే పరిమితమయ్యేవారు. విలన్‌గా నటిస్తే తమ ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుందనే భయం వారిలో ఉండేది. అందుకే విలన్‌గా చేసే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసేవారు.   ఇప్ప్పుడు ట్రెండ్ మారింది. విలన్‌గా చేసినంత మాత్రాన ఒరిగే నష్టం ఏమీ లేదని గ్రహిస్తున్నారు హీరోలు. అందుకే ఇతర భాషల్లో విలన్‌గా నటించే అవకాశం వస్తే సంతోషంగా ఒప్ప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో విలన్స్‌గా నటిస్తున్న హీరోల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కథ, అందులోని తమ క్యారెక్టర్ నచ్చితే అది విలన్ క్యారెక్టర్ అయినా, నెగెటివ్ షేడ్స్ ఉన్నా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఓటీటీలు, పాన్ ఇండియా మూవీస్ బాగా పెరిగిపోవడంతో ఇమేజ్ కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు హీరోలు. స్టార్ ఇమేజ్ వల్లే సినిమాలు సక్సెస్ అవుతాయనే మాటకు ఇప్ప్పుడు కాలం చెల్లింది. కంటెంట్, క్యారెక్టరైజేషన్, ఏ పాత్ర తీరు ఎలా ఉంది, ఆ పాత్రల్లో నటీనటులు ఎలా పెర్‌ఫార్మ్ చేస్తున్నారు అనేదే ప్రధానంగా ప్రేక్షకులు చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఇమేజ్ లేని హీరో చేసినా ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

షాకింగ్.. జబర్దస్త్ కమెడియన్ మృతి.. యాంకర్ సుమ కన్నీటి పర్యంతం!

Publish Date:Feb 4, 2026

  ప్రముఖ జబర్దస్త్ నటుడు కన్నుమూత టీవీ పరిశ్రమలో విషాద ఛాయలు స్టార్ యాంకర్ సుమ కన్నీటి పర్యంతం   తెలుగు బుల్లితెరపై 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'సుమ అడ్డా' వంటి షోల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ కన్నుమూశారు. ఆయన సోమవారం మృతి చెందగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   సోమవారం రాత్రి రాజమండ్రిలోని 'రోడ్డు కం రైల్వే బ్రిడ్జి'పై జరిగిన ప్రమాదంలో బాబీ మృతిచెందారు. బాబీ బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. అతివేగంగా రెండు బైక్‌లు ఢీకొనడం, హెల్మెట్లు ధరించకపోవడంతో.. ఈ ప్రమాదంలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.     బాబీ మరణవార్త తెలిసి బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తనతో పాటు సుమ అడ్డా షోకి బాబీ కూడా పని చేశారు. ఆ అనుబంధంతోనే బాబీ మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్ళిన సుమ, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో సుమ కన్నీటి పర్యంతమయ్యారు.     మాజీ ఎంపీ హర్ష కుమార్ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన బాబీ, నటనపై ఆసక్తితో బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమ అడ్డా షోలతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే కమెడియన్ గా ఎదుగుతున్న బాబీ.. 28 ఏళ్ళ వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం.. టీవీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. బుల్లితెరకు చెందిన పలువురు కమెడియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా బాబీకి నివాళులర్పిస్తున్నారు.    Also Read: శ్రీరాముడిగా మహేష్ బాబు.. ఆ 25 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేరు!  

మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!

Publish Date:Feb 1, 2026

  ఒక్కోసారి ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి కాంబోనే సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదెని(Haneef Adeni) చేతులు కలుపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.   బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి సహా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.   రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మలయాళ సినిమాలలో 'మార్కో' ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయలెంట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి వయలెంట్ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ గతేడాది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ హీరోను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ లో నటించనున్న హీరో బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది.   బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన మాస్ ఇమేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి బాలకృష్ణను వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నిజంగానే ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.  

Mega Swap: Pawan Kalyan UBS for Ram Charan Peddi

Publish Date:Feb 3, 2026

Mega Family stars seem to swap the release dates according to insider buzz. The reports suggest that Pawan Kalyan starrer Ustaad Bhagat Singh, directed by Harish Shankar and produced by Mythri Movie Makers is set for a worldwide release on 26th March 2026, in place of already scheduled Ram Charan's Peddi.  The change comes as Ram Charan and his wife, Upasana Konidela, recently welcomed twins—a baby boy and a baby girl—on January 31, 2026. Earlier, Charan had informed director Buchi Babu Sana and the Peddi team that he would be unavailable for at least three to four weeks after the delivery to spend time with his family. While Charan gave extra dates before the delivery to finish the film, some shoot delays occurred. Director Buchi Babu Sana reportedly asked for more time to perfect important sequences in the second half of the movie to deliver the best quality product. Charan is now expected to return to the sets in March to finish the remaining portions. So, Mythri Movie Makers, who are also presenting Peddi, have decided that releasing Ustaad Bhagat Singh will be perfect for that weekend. Currently, they have fast tracked the post production works to finish the film in time and start promotions for the release date. Official confirmation will arrive in few days, it seems.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Om Shanti Shanti Shantihi

Publish Date:Dec 31, 1969

Nari Nari Naduma Murari

Publish Date:Dec 31, 1969

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969