Home » Women's Safety » మన రక్షణ మన చేతుల్లోనే

 

అమ్మాయిలకు రక్షణ లేదు అన్న మాటని ఈ మధ్య తరచూ వింటున్నాం. అందుకే వారికి రక్షణ కల్పించేందుకు తయారుచేసిన ఓ జాకెట్ మన చెంత ఉంటే ఏ చెంతా ఉండదట.

అమ్మాయిలు దుస్తులే వారికి రక్షణ కవచాలుగా మారితే ఇక ఏ భయమూ ఉండదు కదా అదే ఆలోచనతో తయారు చేసిందే "నో కాంటాక్ట్ జాకెట్". చూడటానికి మాములు కోటులాగా కనిపించే ఈ జాకెట్ వేసుకున్న వారికి తప్పించి వేరే ఎవరు తాకినా విద్యుత్ ప్రవహించి షాక్ కొట్టేలా దీనిని తయారు చేశారు. కోటుకు ఉండే చిన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు విద్యుత్ ప్రవహిస్తుంది. జాకెట్ ను లోపల ఇన్సులేషన్ లా పనిచేసే రబ్బరుతో తయారు చేసారు కాబట్టి వేసుకున్న వాళ్ళకి ఏ హాని జరగదు. అప్పుడప్పుడు ఈ జాకెట్ కి చార్జింగ్ చేస్తుండాలి.