Home » Articles » వీధి వీధినా వినాయకుడే..

 

వీధి వీధినా వినాయకుడే...

 

సాధారణంగా ఏ పండుగ వచ్చినా.., ఆ పండుగ వాతావరణం ఆ రోజుకే పరిమితమై ఉండుంది. కానీ.., కొన్ని పండుగల సందడి వారం రోజుల ముందునుంచే మొదలై, పండుగ వెళ్లిన పది రోజులదాకా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి పండుగల్లో మొదటిది వినాయకచవితి, రెండవది విజయదశమి (దసరా) మూడవది శ్రీరామనవమి.ఆబాల గోపాలం కలిసి, చందాలు వసూలు చేసి, సామూహికంగా జరుపుకునే పండుగలు ఈ మూడే. అయితే, ఈ మూడు పండుగల్లో మరింత ప్రత్యేకత గల పండుగ ‘వినాయకచవితి’. ఎందుకంటే.. వారంరోజుల ముందునుంచే వివిధ రూపాల్లో, వివిధ పరిమాణాల్లో, వీధివీధినా కొలువుతీరి వుంటాడు వినాయకుడు.

పత్రికై పిల్లల పరుగులు

‘ఒరేయ్...ఇంకా పడుక్కునే ఉన్నార్రా..తెల్లారితే వినాయకచవితి పండుగరా...వెళ్ళి పత్రి తీసుకురార్రా’ అని తాతయ్యలు అరుస్తూంటే.., మంచాలమీంచి దుమికి, ఉరుకులు పరుగులుగా వీధుల్లోకి పరుగులెత్తే

More...