Home » Day Six » నైవేద్యం -కాజు హల్వా

 

 

కాజు హల్వా

 



!! కావలసినవి !!

జీడిపప్పు - రెండు కప్పులు
పంచదార - రెండు కప్పులు
 నెయ్యి - ఒక కప్పు
 
!! తయారీ !!

జీడిపప్పులను రెండు గంటలపాటు నీటిలో  నానబెట్టాలి. తరవాత వాటిని తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.  ఇప్పుడు స్టవ్ పై  బాణలి పెట్టి అందులో జీడిపప్పు పేస్ట్, పంచదార వేసి స్టవ్ మీద ఉంచి చిన్న మంట పెట్టి బాగా ఉడికేవరకు కలుపుతుండాలి. చివరగా నెయ్యి వేసి బాగా కలిపి దించేయాలి. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అంతటా సమంగా పరుచుకునేలా చేసి చల్లారాక డైమండ్ ఆకారంలో కట్‌చేసుకుని నైవేద్యం సమర్పించుకోవాలి