Home » Day Seven » నైవేద్యం - బొబ్బట్లు

 

బొబ్బట్లు

 



కావలసినవి :

శనగపప్పు      -   ఒకటిన్నర కప్పు
మైదాపిండి      -   రెండు కప్పులు
వెన్నపూస       -  కొద్దిగా
ఉప్పు             -  చిటికెడు
నెయ్యి             -  అరకప్పు
బెల్లం తురుము  -  ఒకటిన్నర గ్లాస్
పంచదార         -  అర గ్లాస్
ఇలాచీ పొడి       - ఒక టీ స్పూన్
నూనె               - ఒక స్పూన్

 తయారీ :

ముందుగా శనగపప్పు మెత్తగా ఉడికించాలి.ఇందులో తరిగిన బెల్లం,పంచదార, కలిపి బాగా దగ్గరయ్యేవరకు ఉడికించాలి. ఇందులో ఇలాచీపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు మైదాపిండిలో ఉప్పు,వెన్నపూస కలిపి తగినన్ని నీళ్ళతో చపాతీపిండిలా మృదువుగా కలపాలి.ఈ పిండికి కొంచెం నూనె రాసి ఒక గంట నాననివ్వాలి. ఇప్పుడు నానిన పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని  వత్తి మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్ని వైపులా మూసి ఉండ చేసుకుని దీన్ని పలుచని చపాతీలా వత్తి పెనం పై వేసి రెండువైపులా నేతితో కాల్చుకోవాలి.