Home » Day One » మహిషాసురుని జన్మవృత్తాంతం

 

 

 

దానవ వంశానికి మూలపురుషుడైన ‘దనువు’కు... రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరు పుట్టుకతో దానవులైనా.. గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్లు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికి ఉన్న ఒకేఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు ‘పంచనదం’ అను మడుగులో దిగి ఒంటి కాలిమీద తీవ్రతపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతోపాటు వారిరువురి తపస్సుకూడా వేగంగా సాగుతోంది. వారి తీవ్రతపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది.

More......