నైవేద్యం - రవ్వ కేసరి
!! కావలసినవి !!
బొంబాయి రవ్వ-100 గ్రాములు;
మిఠాయి రంగు: చిటికెడు;
జీడిపప్పు, బాదాం, కిస్మిస్: అరకప్పు
చక్కెర - 100 గ్రాములు
యాలకుల పొడి- పావు టీస్పూన్
నెయ్యి -తగినంత
!! తయారీ !!
ముందుగా గిన్నెను స్టవ్ పై ఉంచి నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు, బాదాం, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టు కోవాలి. అదే గిన్నెలో బొంబాయిరవ్వ వేసి వేయించాలి. వేయించిన రవ్వను కూడా విడిగా తీసిపెట్టాలి. ఇప్పుడు గిన్నెలో ఒకటికి మూడొం తుల నీళ్లు పోసి, మరగించాలి. మరిగే నీళ్లల్లో పంచాదార, మిఠాయి రంగు వేసి కలపాలి. పంచదార కరిగాక, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి. చివరిలో మిగిలిన నెయ్యీ వేసి కలిపి, దించేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్ లతో అలంకరించి నైవేద్యం పెట్టాలి.