Home » Day Five » నైవేద్యం - పెసర బూరెలు

 

పెసర బూరెలు

 



 కావలసిన పదార్దాలు :

 పెసరపప్పు - ఒక కప్పు
 మైదా - రెండు కప్పులు
 పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
 పంచదార - ఒక కప్పు
 నూనె -  సరిపడ
 ఇలాచి పొడి -  స్పూన్

 తయారీ:

ముందుగా పెసర పప్పును నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండితో  ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీలు ఉడికిన తరువాత వీటిని చేతితో పొడిలా చేసి దీనిలో కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి వేసి కలిపితే గట్టిగా తయారవుతుంది. దీనిని చిన్నచిన్న ఉండలుగా చే సిపెట్టుకోవాలి. మైదా లో చిటికెడు ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసి నీళ్ళు పోసి బజ్జి పిండిలా  కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి పెసర ఉండను మైదాలో ముంచి కాగె నూనెలో వేసి దోరగా వేగాక వాటిని ప్లేట్ లోకి తీసుకుని దేవికి నివేధించాలి.