పులిహోరా
కావలసిన పదార్ధాలు :
బియ్యం - 1 కప్పు
చింతపండు - 2 నిమ్మకాయంతవి
పసుపు - 1 టేబుల్ స్పూన్
వేయించిన వేరుశెనగపప్పు - 2 - 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు
నూనె
పోపు కొరకు
ఆవాలు - 1 టీ స్పూన్
పచ్చి శెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీల కర్ర - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 4
తయారు చేయు విధానం:
ముందుగ బియ్యం ని 2 కప్పులు నీళ్ళు పోసి ఉడక పెట్టుకోవాలి. ఉడికించిన అన్నంని పక్కన చల్లారి పెట్టుకోవాలి పసుపు , ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండుని వేడి నీళ్ళల్లో నానపెట్టి రసం తీసి పెట్టుకోవాలి వేరే. బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం పోసి చిక్కగా అయ్యే వరకు ఉడక పెట్టుకోవాలి వేరే పాన్ తీసుకొని తగినంత నూనె పోసి కాగాక ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శెనగపప్పుని వేయించాలి. వేగాక జీలకర్రని, వేరుశెనగపప్పుని, ఎండు మిరపకయాలని వేసి ఒక నిముషం పాటు వేయించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి. తరువాత చింతపండు పులుసు వేసి బాగా కలపాలి.