jeremy

 

కొదుమగుళ్ళ వేణుగోపాలా చారి

కొదుమగుళ్ళ వేణుగోపాలా చార్యగారు ప్రముఖ పంచాంగకర్త. వంశపారంపర్యంగా వస్తున్న జ్యోతిర్విద్యపై మరింత పట్టు సాధించేందుకు నిత్యం కృషి చేస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, దాంపత్య చిరాకులు, ఇతర సమస్యలకు కారణాలు, వాటికి జ్యోతిష్యపర పరిష్కారాలపై పరిశోధన చేస్తున్నారు..

పౌరాహిత్యం వృత్తి. పంచాంగ గణితం ప్రవృత్తి. హనుమత్ ఉపాసకులైన వేణుగోపాలాచార్యులుకి శ్రీరామచంద్రస్వామి ఆరాధ్య దైవం.

శ్రీ దయాకరశర్మ సిద్ధాంతిగారు పంచాంగం, గణితం నేర్పిన గురువైతే, తాతగారు రామాచార్యులు, తండ్రి శేషాచార్యులు జ్యోతిష్య విద్యలో గురువులు. పేద విద్యార్థులకు నిత్యం అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తూ అటు ఆధ్యాత్మికతని, ఇటు సేవని కలిపి జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకున్నారు శ్రీ కొదుమగుళ్ళ వేణుగోపాల చార్య స్వామి.