Facebook Twitter
తెలుగు భాష

తెలుగు భాష 

 

సీ. 
అక్షర మక్షర మధిదేవతా రూప
గమకాన తెనుగుకీ కమ్మదనము!

ఆది దేవు నభయ హస్తంపు డమరుక
మందించ తెనుగాయె నమర సుమము! 

కైలాస శిఖరాగ్ర కాలుని నృత్యాల
యుద్భవమ్మున తెన్గు యున్నతమ్ము! 

నెలతాల్పు తలయూపు నెలవెల్గు కలబోయు
చందాన తెనుగుకీ చల్లదనము! 

ఆ. వె. 
అమ్మలాలి పాటఁ జెమ్మగిల్లిన భాష! 
ఆలి సేదఁ దీర్ప నల్లుభాష! 
రక్తి భక్తి ముక్తి రంగరించిన భాష! 
భాషల ద్రువతారఁ బలుక లేర ? 

 

రచన : గుండా వేంకట సుబ్బ సహదేవుడు