Facebook Twitter
సవ

సవ

మొండి గోడలా
మారిన మది 
మీద మొల్చిన
లేలేత అద్భుతం

రెప్పలార్పక కనిన
మోడు వారిన కాయం
హృదిలో దాచిన
మండే జ్ఞాపకాలు
అన్నీ మటు మాయం

ఎడారి దారుల్లో
ఎదురొచ్చి 
చిరు హాసముతో
నీడలోకి పిలిచే
మురిపెపు తన
పేగు బంధం 

చీకటి నిండిన త్రోవలో
ఆ అనురాగాపు
అనుబంధం తోడులో
నిరతం వెలుగుల మయం...!!

- కవిత రాయల