Facebook Twitter
మళ్ళీ తిరిగి రాదీ క్షణం

ప్రతి క్షణం విలువైనది అంటారు. ఈ క్షణం గడచిపోతే మళ్ళీ తిరిగి రాదు. విచిత్రం ఏమంటే గడచిన క్షణానికి 

ఈ క్షణానికి ఎంతో తేడా ఉంటుంది. గడచిన క్షణం ఆనందమయమై ఉండవచ్చు, మరుక్షణం దుఃఖ భాజనం కావచ్చు. ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పొద్దున్నే రుచికరమైన అల్పాహారం తిని బార్య ఇచ్చిన కమ్మటి కాఫీ తాగి...  ఆ క్షణాలను ఆనందంగా ఆస్వాదించిన వ్యక్తి, వృత్తి కోసం గడప దాటుతూ కాలు తగిలి దుభాలున కిందపడి కాలు విరిగి అలవి కాని బాధకు గురికావచ్చు.  చేతిలో పైసా లేని ఒక వ్యక్తి ఆకలితో నకనకలాడుతూ రోడ్డుపై నడుస్తుంటే మిత్రుడు తారసపడి... ఆనందంతో గుండెలకు హత్తుకుని - రావోయ్ అలా వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటూ... కడుపునిండా ఆహారం పెట్టించనువచ్చు.  అలా క్షణక్షణాలు సరికొత్త అనుభవాలకు హేతువులవుతాయి.  ఇచ్చ, ప్రవర్తన, నడవడిక, ఇతరులతో మన వ్యవహారాలు, పరిసరాలు, క్రియ... గెలుపు, ఓటములు లాంటి అనుభవాల సమూహమే క్షణాలు అంటారు.

మన భవిష్యత్ ఎలా నడుస్తుందో చేబుతామంటూ జోస్యులు వస్తారు. క్షణ క్షణం మారుతుండే కాలగాతులను ఎవరైనా కచ్చితంగా ఉహించడం అసాధ్యం. మన భవిత రేపు చేయబోయేదానిపై కాదు - నేడు, ఈ క్షణం చేసేదానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ప్రారంభమయ్యేది రేపటినుంచి కాదు. నేటి నుంచే ... కాదు... ఈ క్షణం నుంచే!

    మనం జన్మించిన క్షణం నుంచే జీవితం ఆరంభమవుతుంది. ఈ దేహంలో నుంచి జీవం పోయిందా, ఆ జీవి క్షణాలు అక్కడే ఆగిపోతాయి, అందుకే జీవితం అంటే కాలగమనం అంటుంది అవ్యక్తోపనిషత్తు, ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి. మంచి సంభవించినా, చెడు ఎదురైనా... క్షణాలు గడిచే కొద్దీ వాటి ఫలితాలు మారుతూ ఉంటాయి. భవిష్యత్తును ఉహించుకొని భాధపడటమో, రంగురంగుల కలలు కనడమో కాదు- ఈ క్షణంలో వివేకంతో శ్రద్ధతో జీవించాలి. గతంలో పొందిన కష్టసుఖాలను పక్కన పెట్టాలి. ఈ క్షణంలో లబించే వరాలను అనుభవించాలి. కష్టమైనా సుఖమైనా పశ్చ్త్తాత్తాపం లేకుండా  స్వీకరించా

 భవితకోసం చేసే ఆలోచనలు, కనే కలలు, అభిలాషలు, లక్ష్యాలు, కార్యాచరణ పధకాలు... వేటినైనా ఈ క్షణం నుంచే అమలుపరచాలి. జ్వరానికి ఔషదం ఈ క్షణం నుంచే తీసుకోవాలి. కూతురి పెళ్ళి చేయాలనుకుంటే 

ఆ శుభకార్యానికి అవసరమైన యత్నాలకు ఈ క్షణమే శుభకరం. ఈ క్షణం ఎలా ఉపయోగించుకొన్నామా అన్నదానిపైనే రాబోయే క్షణాల్లో ఫలితాలు ఉంటాయి. నిన్న అన్నది గతం.  రేపు అనేది ఎవరూ ఉహించని రహస్యం. ఈ క్షణాలు ఒక బహుమానం. వాటిని ఆస్వాదించాలి. చింతించడం వల్ల నిన్నటి బాధ తీరదు. ఏమవుతుందోననే దిగులువల్ల రేపు సంభవించే సంఘటనలో మార్పురాదు.  గతానికి, భవితకు వారధి ఈ క్షణం. మన వెనక గతం ఉంది. దానినుంచి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది. దానికోసం సిద్ధం కావాలి. కానీ ఈ క్షణం మనది...  దానిలో జీవించాలి. క్షణాలు గడిచే కొద్దీ గంట గడసిపోతుంది. గంటలు గడచిపొతే రోజులు గతాలవుతాయి. మనం విశ్రాంతి తీసుకొవలసింది ఎప్పుడంటే ... 

 అందుకు బొత్తిగా మనకు సమయం లేనప్పుడే!

                - అప్పరుసు రమాకాంతరావు.