Aloo Bread Cutlet
Author : teluguone
Preparation Time : 10 minutes
Cooking Time : 15minutes
Yield : 2
4.0 Stars based on 291 : Reviews
Published On : March 3, 2015
Recipe Category : Breads
Recipe Type : Solo Dish
Total Time : 25 minutes
Ingredient : Aloo Bread Cutlet
Description:

 Aloo Bread Cutlet

Recipe of Aloo Bread Cutlet

 Aloo Bread Cutlet

Directions | How to make  Aloo Bread Cutlet

 

 

ఆలూ బ్రెడ్ కట్‌లెట్

 

 


కావలసినవి :

ఆలూ - నాలుగు 
బ్రెడ్ - పది
ఉల్లిపాయలు - మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
కారం - ఒక స్పూన్
బఠానీలు - రెండు కప్పులు 
టమోటాలు - నాలుగు 
గరంమసాలా - ఒక స్పూన్
టమోటా సాస్ - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
నెయ్యి - సరిపడా

తయారుచేసే విధానం:

ముందుగా బఠానీలను నానబెట్టుకోవాలి. తరువాత ఆలూని ఉడకబెట్టుకోవాలి. తరువాత బ్రెడ్‌ను నీళ్లలో ముంచి ఆ బ్రెడ్‌ను ఉడకబెట్టిన ఆలూలో వేసి కొంచెం పసుపు, కారం వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల మాదిరిగా చేసుకుని పెనం మీద నెయ్యి వేసి దోరగా కాల్చుకోవాలి. తరువాత నానబెట్టిన బఠానీలను కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని  కొద్దిగా నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉడికించిన బఠానీలు వేసి గరంమసాలా, కొద్దిగా కారం , ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఉడికించుకోవాలి. రెడీ చేసిపెట్టుకున్న కట్‌లెట్‌లపై కర్రీ టమాటో సాస్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.