Veet laddu
Author : Teluguone
Preparation Time : 20 minutes
Cooking Time : 15 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : August 25, 2014
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Solo Dish
Total Time : 35 Minutes
Ingredient : Veet laddu
Description:

Veet laddu

Recipe of Veet laddu

Veet laddu

Directions | How to make  Veet laddu

వినాయకచవితి స్పెషల్

వీట్ లడ్డు

 





కావలసినవి:
గోధుమపిండి - ఒకటిన్నర కప్పు
శాఫ్రన్ కలర్ - 3 చుక్కలు.
నెయ్యి- అర కప్పు
బొంబాయి రవ్వ - నాలుగు టేబుల్ స్పూన్లు
బాదం పలుకులు - 5
కిస్‌మిస్ - టేబుల్‌స్పూన్
పంచదార పొడి - 3/4 కప్పు
ఏలకుల పొడి- అర టీ స్పూన్


తయారి:
ముందుగా పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక గోధుమపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి బాదం పలుకులు, కిస్‌మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి అదే పాన్ లో బొంబాయి రవ్వను వేయించాలి. అందులో ఏలకుల పొడి, గోధుమపిండి, బొంబాయి రవ్వ వేసి  కలిపి  వేయించాలి. మరొక పాన్‌లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేసి ముందుగా వేయించిన గోధుమపిండి రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్‌మిస్ వేసి  రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారక ముందే ఈ మిశ్రమంతో కావలసిన సైజ్ లో లడ్డులు చేసుకోవాలి