Chicken Haleem (Ramzan Special)
Author : Teluguone
Preparation Time : 15m
Cooking Time : 15m
Yield : 2
4.0 Stars based on 291 : Reviews
Published On : April 20, 2023
Recipe Category : Non-Vegetarian
Recipe Type : Solo Dish
Total Time : 30m
Ingredient : Chicken Haleem (Ramzan Special)
Description:

Haleem is a famous Hyderabadi dish prepared especially during Ramzan season. It is a high calorie dish which gives instant energy.

Recipe of Chicken Haleem (Ramzan Special)

Chicken Haleem (Ramzan Special)

Directions | How to make  Chicken Haleem (Ramzan Special)

చికెన్‌ హలీం
(రంజాన్ స్పెషల్)

 

 

కావలసినవి :

బోన్ లెస్ చికెన్ - 500 gms
గోధుమ రవ్వ - 250 gms
సెనగపప్పు -  5 tbsp 
బియ్యం -  5 tbsp 
పచ్చిమిర్చి - 5
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 tsp
పుదీనా  - 1/2 కప్పు
కొత్తిమీర - 1/2 కప్పు
ఉల్లిపాయ - 2
పెరుగు - 1 కప్పు
ఉప్పు - తగినంత
పసుపు - 1 tsp
కారం - 2 tsp
గరం మసాలా - 1 tsp
మిరియాలపొడి - 1/2 tsp
సొంటి పొడి - 1/2 tsp
నిహారి మసాలా లేదా పోట్లీ మసాలా - 1 చిన్న పాకెట్
లవంగాలు - 8
దాల్చిన చెక్క - 3 / 4 ముక్కలు
యాలకులు - 8
షాజీరా - 2 tsp
నూనె - 1/4 కప్పు
నెయ్యి - 5 tbsp 

 

తయారీ విధానం :

ఒక కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, సెనగపప్పు, బియ్యం, చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద, పైన చెప్పిన మసాలా దినుసులలో సగం (యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీరా),  సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, సగం కొత్తిమీర. సగం చెంచాడు పసుపు వేయాలి.

 

ఇందులో బైట మార్కెట్ లో దొరికే నిహారి మసాలా లేదా పోట్లీ మసాలా ఒక సన్నటి బట్టలో మూట కట్టి వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

 

మూత తీసి  గోధుమ రవ్వ వేసి కలిపి మూత పెట్టి మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. 

 

పూర్తిగా చల్లారిన తర్వాత పొట్లీ మసాలా మూట తీసేసి ఉడికిన చికెన్ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

 

స్టవ్ మీద ఒక పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర , అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేసి కొద్దిగా వేగాక కారం, మిరియాలపొడి, సొంటిపొడి, గరం మసాలాపొడి వేసి కలుపుతూ వేయించాలి.

 

ఇందులో కప్పుడు పెరుగు వేసి కలపాలి.  తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి సన్నని మంటమీద కలుపుతూ నిదానంగా ఉడికించాలి. 

 

హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి. 

 

సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా నూనెలో కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి.

 

హలీమ్ మొత్తం ఉడికి నూనె, నెయ్యి కలిసి పైకి తెలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్‌లో వేసి వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి.