Bellam Avakaya
Author : Teluguone
Preparation Time : 10m
Cooking Time : 15m
Yield : 3
4.0 Stars based on 291 : Reviews
Published On : May 11, 2019
Recipe Category : Pickles
Recipe Type : Solo Dish
Total Time : 25m
Ingredient : Bellam Avakaya
Description:

Bellam Avakaya

Recipe of Bellam Avakaya

Bellam Avakaya

Directions | How to make  Bellam Avakaya

 

ఈ వీడియో చూస్తే బెల్లం ఆవకాయ ఇంత తేలిగ్గా పెట్టొచ్చా అనుకుంటారు..

 

అమ్మ ఆవకాయ అంజలి అస్సలు బోరు కొట్టవు అని ఎదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్ కొట్టదు. ఆవకాయ రుచి ని ఆస్వాదించడానికి ఆంధ్ర, తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు, చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు, పేదవాడికి, ధనికుడికి అందరికి బంధువు ఈ ఆవకాయ. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీ లో ఉంటారు, కానీ రుచి గా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికి సాధ్యం అవదు, కానీ కిలోల కొలతలతో కాకుండా ఇపుడు మేము చెప్పే ఈ సులభమైన పద్దతిలో చేసి చూడండి. ఆవకాయ అనగానే కారంఒకటే కాదు ఇలా తియ్య తియ్యగా ఉప్పగా పుల్లగా కారం గ కూడా చేసుకుంటే చాల బాగుంటుంది , అదే బెల్లం ఆవకాయ ,మరి అదెలా  చేసుకోవాలో చూద్దాం..

 

ముఖ్యమైన విషయం: ఈ బెల్లం ఆవకాయ పెట్టాలంటే తప్పనిసరిగా కలెక్టర్ మామిడికాయల్నే తీసుకోవాలి , హైదరాబాద్ లో అయితే తోతాపురి అంటారు , ఈ కాయలతో పెడితేనే ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది.

 

బెల్లం ఆవకాయ పెట్టడానికి కావాల్సినవి :

ముందుగా మామిడికాయలు తీస్కుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంటా పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి మనకు కావాల్సిన సైజు లో ముక్కలు కోసి పెట్టుకోవాలి.

మామిడి ముక్కలు - ఒకటిన్నర కప్పులు

కారం ,  ఆవపిండి, ఉప్పు (దొడ్డు ఉప్పు ) ఈ మూడు కలిపి - ఒక కప్పు  తీసుకోవాలి

పసుపు - తగినంత 

నువ్వుల నూనె - ముక్కలు మునిగేంత 

 

తయారు చేసే విధానం : 

ముందుగా మనం కొలత కోసం ఎదో ఒక కప్ తీస్కుని దానితో 1 1 / 2 కప్పుల మామిడి ముక్కలు తీసుకుందాం. ముక్కలు మునిగేంత నూనె తీస్కుని ఆ నూనెలో మామిడి కాయ ముక్కల్ని వేసి ముక్కలకి నూనె పట్టించి వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీస్కుని మామిడికాయలు కొలవడానికి తీసుకున్న కప్పు తో , కారం , ఉప్పు , ఆవపిండి ఈ మూడు కలిపితే ఒక కప్పు అయ్యే విధంగా తీసుకోవాలి. ఇపుడా నూనె లో ఒక కప్పు మనం కలిపి పెట్టుకున్న ఆవపిండి , కారం , ఉప్పు మిశ్రమాన్ని వేయాలి. ఇంకా ఒక కప్పు దంచి పెట్టుకున్న బెల్లం కూడా వేయాలి. ఒకవేళ తక్కువ తీపి కావాలంటే సగం కప్పు వేసుకోవచ్చు.. పసుపు అర చెంచా వేస్కోవాలి. చివరిగా మామిడికాయ ముక్కల్ని కూడా వేసి అన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన ముక్కల్ని మూడు రోజుల పాటు ఉంచి , బాగా ఊరిన తర్వాత , ముక్కలు వేరుగా, ఊట వేరు వేరుగా చేసి ముక్కల్ని ఊటని ఒక రోజు ఎండలో పెట్టి ఉప్పు చూసుకుని, ముక్కలు మునిగేంత నూనె పోసుకుని బాగా కలుపుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు బెల్లం ఆవకాయ పాడవకుండా నిలవ ఉంటుంది. ఈ బెల్లం ఆవకాయ తియ్య తియ్య గ, కమ్మగా, రుచి గ , చాల బాగుంటుంది. మరింకెందుకాలస్యం మీరు కూడా బెల్లం ఆవకాయ పెట్టేసుకోండి మరి.....