సజ్జ పకోడీ

కావలసిన పదార్ధాలు:
సజ్జ పిండి - అర కప్పు
సెనగ పిండి లేదా గోధుమ పిండి - అర కప్పు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
పచ్చి మిర్చి తరుగు - ఒక టీ స్పూను
క్యారట్ తురుము - పావు కప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
మిరప కారం - తగినంత
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం:
ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి లేదా గోధుమ పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి.
స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి. బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
సజ్జ పకోడీలను టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది.
|