Pakam Garelu & Vakkaya Pulihora
Author : Teluguone
Preparation Time : 30 Mins
Cooking Time : 30 Mins
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : July 11, 2011
Recipe Category : Rice
Recipe Type : Meals
Total Time : 1 Hour
Ingredient : Black gram, Sugar, Cardamon powder, Oil, Cranberry, Boiled rice, Green chilli, Curry leaves, Turmeric, Salt, Dry chillies, Bengal gram,Cumin seeds, Mustard
Description:

1 Hour

Recipe of Pakam Garelu & Vakkaya Pulihora

 పాకం గారెలు: మినప్పప్పు, పంచదార, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె తగినంత.

వాక్కాయ పులిహోర : 2 లేదా 3 కప్పులు అన్నం , పచ్చిమిర్చి చీలికలు తగినన్ని , కరివేపాకు 4 లేదా 5 టీ స్పూన్లు , తరిగిన వాక్కాయ ఒక కప్పు, , పసుపు పావు టీ స్పూన్లు , ఉప్పు తగినంత , ఎండుమిర్చి , తాళింపు గింజలు (మినప్పప్పు, శనగ పప్పు, ఆవాలు, జిలకర ) రెండు లేదా మూడు టీ స్పూన్లు. , నూనె తగినంత.

Directions | How to make  Pakam Garelu & Vakkaya Pulihora

 

 

పాకం గారెలు

 

 

 

తయారు చేసే విధానం:
  పాకం గారెలు తయారు చేయడానికి రెండు మూడు గంటలు ముందే మినప్పప్పు ను నానబెట్టి గ్రైండ్ చేసిపెట్టుకోవాలి. ఆ తరవాత ఒక స్టవ్ పై డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. ఆ లోపు ఇంకో స్టవ్ పై 1 కప్పు పంచదార , ఒక కప్పు నీళ్ళు వేసి పాకం తయారు చేసుకోవాలి.నూనె కాగాక గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు పిండిని గారెల్లా వత్తుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.తయారైన పాకంలో యాలకుల పొడి వేసి కలిపి ఫ్రై చేసుకున్న గారెలనుకూడా అందులో  వేసి 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. వేడి వేడి పాకం గారెలు రెడీ.

 

 

వాక్కాయ పులిహోర 

 

 

 

తయారు చేసే విధానం:
స్టవ్ పై బాణలి పెట్టి అందులో తగినంత నూనె పోసి అది కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, శనగపప్పు, మినప్పప్పు , కరివేపాకు , పసుపు , పచ్చిమిర్చి , తరిగిన వాక్కాయ, ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకుని అన్నం వేసి బాగా కలపాలి. అంతే వాక్కాయ పులిహోర రెడీ.