రవ్వ రొట్టె
ముందుగానే బియ్యాన్ని కడిగి ఆరాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె పోసి స్టవ్ మీద పెట్టాలి. అది కాగాక నూనె లో జిలకర వేసి, అవి ఎర్రగా ఫ్రై అయ్యాక అందులో నీళ్ళు, ఉప్పు, తరిగిన మిరపకాయలు వేసి మరగనివ్వాలి. ఆ తరవాత బియ్యపు రవ్వ వేసి ఉడకనివ్వాలి. అలా ఉడికిన బియ్యపు రవ్వను దించి పక్కన పెట్టుకోవాలి.
ఒక శుబ్రమైన కవర్ తీసుకుని చేతికి అంటకుండా కొద్దిగా నూనె రాసుకుని ఉడికిన బియ్యపు రవ్వను అప్పడాల్లా వత్తి పెనం పై కొద్దిగా నూనె పోసి కాల్చుకోవాలి. అంతే కరకరలాడే రవ్వ రొట్టె రెడీ.
దీన్ని ఉల్లికారం తో తింటే చాలా బావుంటాయి
పచ్చి మిర్చి బజ్జీలు
ముందుగా నువ్వులు, వాము, కొత్తిమీర, జిలకర పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరవాత పచ్చిమిరపకాయలను నిలువుగా కోసి గింజలను తీసేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. అది వేడయ్యే లోపు గిన్నెలో శనగపిండి, బియ్యపు పిండి, ఉప్పు, వేసి కలుపుకోవాలి. గిన్నెలో కాగిన వేడి నూనెను కొద్దిగా పిండిలో కలుపుకోవాలి. ఆ తరవాత నీళ్ళు పోసి ఉండల్లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ లోపు గిన్నెలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసుకొని కాగనివ్వాలి.
వాము, కొత్తిమీర, నువ్వులు, జిలకర కలిపి చేసుకున్న పేస్ట్ లో చింతపండు గుజ్జు వేసి అంతకు ముందే గింజలు తీసి పెట్టుకున్న మిరపకాయల్లో ఫిల్ చేసుకోవాలి. అలా ఫిల్ చేసుకున్న మిరపకాయలను శనగ పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ.
|