Rava Cutlets
Author : teluguone
Preparation Time : 10min
Cooking Time : 10min
Yield : 5
4.0 Stars based on 291 : Reviews
Published On : June 24, 2016
Recipe Category : Others
Recipe Type : Solo Dish
Total Time : 20min
Ingredient : Ravva cutlets
Description:

Ravva cutlets

Recipe of Rava Cutlets

Ravva cutlets

Directions | How to make  Rava Cutlets

 

 

రవ్వకట్లెట్స్

 

 

ఇవి టీటైమ్ స్నాక్స్ కి, ఎవరినన్నా టీ కి పిలిచినప్పుడు వేడి వేడిగా పెడితే చాలా బాగుంటాయి.

కావలసిన పదార్ధాలు..

సుజి                        -  అరకప్పు

కారన్                       -    పావు కప్పు ( ఫ్రోజెన్ కారన్ పేకెట్లలో దొరికేది లేక  పచ్చిది)

ఉల్లిపాయ                  -    ఒకటి

పచ్చిమిర్చి                -    ఒకటి

కరివేపాకు                 -    నాలుగు రెబ్బలు

ఉప్పు                        -    తగినంత

మైదా                       -    రెండు స్పూన్లు

నూనె                       -    తగినంత

బ్రెడ్ ముక్కలు            -    తగినన్ని

కాప్సికం ముక్కలు      -    తగినన్ని

తయారీ విధానం..

* ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకకప్పు నీరు మరిగించండి. మరిగే నీళ్లలో రెండు స్పూన్లు నూనెవేసి సుజి, కారన్, సన్నగా తరిగిన కాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు తగిన ఉప్పు వేసి కలుపుతుంటే సుజి దగ్గరపడుతుంది.

* ముద్దలా అయి గట్టి పడగానే దించేయాలి.

* అది చల్లారేలోగా మూడునాలుగు బ్రెడ్ ముక్కలు గ్రైండర్ లో పొడి చేసి పెట్టుకోవాలి.

* అందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా, నీళ్లు పోసి పల్చగా రెడీ చేసి.. చల్లారిన ముద్దని మీ ఇష్టం వచ్చిన షేపులో కట్లెట్ మాదిరి తయారు చేసి పలచటి మైదాలో ముంచి వెంటనే బ్రెడ్ పౌడర్ లో అద్ది వేడినూనె లో వేయించాలి.

* నూనె వేడి తగ్గిస్తూ ,పెంచుతూ సమానంగా వేయిస్తే.. పైన కర కర లాడుతూ మంచి రుచిగా ఉంటాయి. కొత్తిమీర ,పుదీనా పచ్చడి కాంబినేషన్ సూపర్ .

..Kameswari