Directions | How to make  Undrallu (Vinayaka chavithi special)
ఉండ్రాళ్ళు(వినాయక చవితి స్పెషల్)
వినాయకచవితి పండుగ రోజు గణపతికి పెట్టే ప్రసాదాల్లో ముఖ్యంగా ముందు వరుసలో ఉండేది ఉండ్రాళ్లు. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..
కావలసిన పదార్దాలు:
* బియ్యం రవ్వ - 1 కప్పు
* నూనె - 2 చెంచాలు
* జీలకర్ర - 1/2 స్పూన్
* ఉప్పు - 1/2 స్పూన్
* సెనగపప్పు - 3 స్పూన్స్
* నీళ్ళు - 2 కప్పులు
తయారీ విధానం:
బియ్యంరవ్వను.... (మిక్సిలో బియ్యం ఆడించి.. వచ్చిన రవ్వను జల్లించి..పైన వచ్చిన రవ్వను) ఉండ్రాళ్ళకు వాడతారు.
ముందుగా దళసరి గిన్నె తీసుకుని 1 కప్పు రవ్వఅయితే... 2 కప్పుల నీళ్ళు గిన్నెలో పోసి...సెనగపప్పు వేసి జీలకర్రతో పాటు 2 స్పూన్స్ నూనె కలపాలి. బాగా మరుగుతున్న నీటిలో రవ్వ కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పూర్తిగా రవ్వ పోసికలిపి మూత పెట్టాలి. అలా సిమ్ లో 5 నుంచి పదినిమిషాలలోపు ఉంచితే రవ్వ పలుకు లేకుండా ఉడుకుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి మగ్గాక వెడల్పు పళ్ళెం లేక బేసినలోకి ఈ రవ్వను తీసి చల్లారనిచ్చి తడి చేతికి కొద్దిగా నేయి రాసుకుని ఉండలుగా చుట్టాలి...అంతే ఉండ్రాళ్ళు రెడీ....