Local Kitchen - Sajja Appalu and Alu Bread Cutlet
Author : Teluguone
Preparation Time : 10 Mins
Cooking Time : 20 Mins
Yield : 2 to 3
4.0 Stars based on 291 : Reviews
Published On : May 28, 2011
Recipe Category : Appetizers
Recipe Type : Solo Dish
Total Time : 30 Mins
Ingredient : Bombay Rava, Maida, Milk, Suger, Baking Powder, Dalda, Oil, Potato, salt, chilli powder, Cardamaom
Description:

 

Local Kitchen - Sajja Appalu and Alu Bread Cutlet

Recipe of Local Kitchen - Sajja Appalu and Alu Bread Cutlet

కావలసిన పదార్థాలు :

బొంబాయ్ రవ్వ,  మైదాపిండి, పాలు, పంచదార, బేకింగ్ సోడా, డాల్డా, యాలకులు .నూనె., ఆలూ, బ్రెడ్, కారం, ఉప్పు,  కొత్తిమీర, క్యారట్ తురుము, టమాటా సాస్.

Directions | How to make  Local Kitchen - Sajja Appalu and Alu Bread Cutlet

 

 

సజ్జ అప్పాలు

 

 

కావలసిన పదార్థాలు :

బొంబాయ్ రవ్వ, మైదాపిండి, పాలు, పంచదార, బేకింగ్ సోడా, డాల్డా, యాలకులు .నూనె. 

 

తయారు చేసే విధానం :

ముందుగా గిన్నెలో డాల్డా వేసి అది కాగాక బొంబాయ్ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే చెక్కెర కూడా వేయాలి. రెండింటినీ కాసేపు ఫ్రై చేసి పాలు పోయాలి. అవసరమైనుకుంటే కొద్దిగా నీరు పోయాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత ఇలాయ్చి పౌడర్ వేసుకుని దింపేయాలి. సజ్జఅప్పాలకు కావలసిన హల్వా రెడీ.

ఇప్పుడు ఇంకో గిన్నెలో నూనె పోసి స్టవ్ పై ఉంచాలి. అవి వేడెక్కేంతవరకు మైదా పిండిలో నీళ్ళు కలిపి, అందులోనే బేకింగ్ పౌడర్ర్ వేసి ఉండల్లేకుండా ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిన విధంగా హల్వాని అప్పాల్లా చేసి మైదా పిండిలో ముంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసి తీసేయాలి.

అంతే టేస్టీ సజ్జ అప్పాలు రెడీ.

 

ఆలూ, బ్రెడ్ కట్ లెట్

 

 

 

కావల్సిన పదార్థాలు :

ఆలూ, బ్రెడ్, కారం, ఉప్పు, పాలు, కొత్తిమీర, క్యారట్ తురుము, టమాటా సాస్

 

తయారు చేయవలసిన విధానం :

ముందుగానే ఉడికించిన ఆలుని,బ్రెడ్ ని స్మాష్ చేసుకొని, అందులోనే పాలను కలపాలి. తగినంత క్యారట్ తురుము, కారం, ఉప్పు కూడా వేసి ముద్దగా ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఈ లోపు స్టవ్ పై గిన్నె పెట్టి అందులో కొద్దిగా( వీడియోలో చూపిన విధంగా) నూనె వేసి అది కాగాక అప్పాల్లా తయారుచేసున్న ఆలు మిశ్రమాన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఆలూ బ్రెడ్ కట్ లెట్ రెడీ.

దీనిని టమాటో సాస్ తో తింటే చాలా బావుంటుంది.