Cauliflower kabab
Author : Teluguone
Preparation Time : 10 Minits
Cooking Time : 10 Minutes
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : September 20, 2024
Recipe Category : Appetizers
Recipe Type : Starter
Total Time : 20 minutes
Ingredient : Cauliflower kabab
Description:

Cauliflower kabab

Recipe of Cauliflower kabab

Cauliflower kabab

Directions | How to make  Cauliflower kabab

 

కాలీఫ్లవర్ కబాబ్

 

 

 

కావల్సినవి:
క్యాలీఫ్లవర్‌- 200 గ్రాములు
నూనె- పావుకప్పు,
ఉప్పు - తగినంత
మిరియాలపొడి- తగినంత.
కొత్తిమీర, పుదీనా- కొద్దిగా
వెల్లుల్లి- 5
బ్రెడ్‌ ముక్కలు- 4
బ్రెడ్‌పొడి- కప్పు,
షాజీరా- కొద్దిగా
వెన్న- 2 చెంచాలు,
పచ్చిమిర్చి- 4
బంగాళాదుంపలు- 4
ఉల్లిపాయలు- 2

 

తయారీ:
ముందుగా   బంగాళాదుంపను ఉడికించి పైన పొట్టు తీసి  మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు  కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, షాజీరా, అన్నింటినీ కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.తరవాత క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటిలో కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు దోరగా వేయించి మసాలా ముద్ద, ఉప్పు వేసి రెండు నిముషాల తరువాత క్యాలీఫ్లవర్‌ ముక్కలు వెయ్యాలి. బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను తడిపి నీటిని పిండి  క్యాలీఫ్లవర్‌ వేపుడులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని  చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముద్దకు ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా వెన్న చేర్చి బాగా మిక్స్ చేసుకుని  పెద్ద ఉండగా చేసుకొని మధ్యలో క్యాలీఫ్లవర్‌ ఉండలు పెట్టి  కబాబ్‌ లుగా చేసి బ్రెడ్‌ పొడిలో అద్దాలి. ఇప్పుడు వీటిని పెనం మీద  నూనెతో బ్రౌన్ కలర్ వచ్చెవరకు రెండువైపులా కాల్చుకోవాలి. కాలీఫ్లవర్ కబాబ్ రెడీ..