Local Kitchen - Sorakaya Payasam and Chicken Balls
Author : Teluguone
Preparation Time : 10 Mins
Cooking Time : 30Mins
Yield : 4
4.0 Stars based on 291 : Reviews
Published On : June 6, 2011
Recipe Category : Sweets N Deserts
Recipe Type : Solo Dish
Total Time : 40Mins
Ingredient : Grated Bottle Gourd, Milk, Pure Ghee, Suger, Cashew, cardamom,dry grape, Chicken, Salt, Maida, Corn flour, Coriander leaves, Curry leaves, ginger and garlic paste mixed with green chilli and Cumin seeds, ajinomoto
Description:

 

 

 

Local Kitchen - Sorakaya Payasam and Chicken Balls

Recipe of Local Kitchen - Sorakaya Payasam and Chicken Balls

 

సొరకాయ పాయసం: సొరకాయ తురుము, పాలు, నెయ్యి, చక్కర, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష

చికెన్ బాల్స్ : చికెన్, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్(జిలకర, పచ్చిమిర్చి కూడా కలిపి), అజినమోటో.

Directions | How to make  Local Kitchen - Sorakaya Payasam and Chicken Balls

 

 

సొరకాయ పాయసం :

 

తయారు చేయవలసిన పధ్ధతి:

ముందుగా జీడిపప్పు, ఎండు ద్రాక్షను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో తురిమిన సోరకాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకో వైపు పాలు వేడి చేసుకోవాలి. సొరకాయ బాగా వేగాక వేడి పాలలో సొరకాయను కలపాలి. అలా దగ్గరపడేంత వరకు ఉడకనిచ్చి అందులో చెక్కెర కలపాలి. చెక్కెర కరిగాక ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న జీడి పప్పు, ఎండు ద్రాక్షను కలపాలి. ఆ తరవాత యాలకుల పొడితో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ పాయసం రెడీ.

 

 

చికెన్ బాల్స్

 

తయారు చేసే విధానం :

గిన్నెలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి స్టవ్ పై పెట్టాలి. అది వేడయ్యే లోపు చికెన్ లో ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్(జిలకర, పచ్చిమిర్చి కూడా కలిపి), కలుపుకోవాలి.

ఆ తరవాత చిన్న చిన్న బాల్స్ లా చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఫ్లేం తక్కువగా ఉండటం మంచిది. ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, క్యారట్ తో గార్నిష్ చేసుకుంటే చికెన్ బాల్స్ రెడీ.