Home » Others » Sago Vadiyalu


 

 

సగ్గుబియ్యం వడియాలు

 

 

కావలసిన పదార్దాలు:
సగ్గుబియ్యం     -     1 కప్పు
ఉప్పు     -     తగినంత
మంచినీళ్లు     -     4 కప్పులు
జీలకర్ర     -     కొద్దిగా
పచ్చిమిర్చి     -     4
నువ్వులపప్పు     -     పావుకప్పు

తయారుచేసే విధానం:

ముందుగా మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌మీదపెట్టాలి. బాగా మరిగిన తరవాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయినట్లుగా రంగులేకుండా అయితే అవి ఉడికినట్లే. తరవాత పాత్రను కిందకి దించి దంచిన పచ్చిమిర్చి, ఉప్పుకలపాలి. జీలకర్ర, నువ్వులు కూడా వేయాలి. కాస్త చిక్కగా గంజిలా ఉన్న దీన్ని చల్లారిన తరవాత ప్లాస్టిక్ కవర్‌మీద కావలసిన సైజులో పెట్టుకోవాలి. ఇవి రెండురోజుల్లో ఎండిపోతాయి. వేయించిన సగ్గుబియ్యం వడియాల్ని స్నాక్స్‌లా కూడా తినవచ్చు.


Related Recipes

Others

Potato-Green Peas Cutlet

Others

Ulli Vadiyalu

Others

Ragi Pindi Vadiyalu (Summer Special)

Others

Annam Vadiyalu (Summer Special)

Others

Goduma Ravva Vadiyalu

Others

Regupallu Vadiyalu

Others

Home Made Pizza

Others

Tofu wraps