Home » Pickles » Pulihora Avakaya


 

ఎంతో సులువుగా చేయగలిగే పులి హోర ఆవకాయ

 

 

అమ్మ ఆవకాయ అంజలి అస్సలు బోరు కొట్టవు అని ఎదో సినిమాలో అన్నట్టు నిజంగా ఆవకాయ అస్సలు బోర్ కొట్టదు. ఆవకాయ రుచి ని ఆస్వాదించడానికి ఆంధ్ర , తెలంగాణ అనే తారతమ్యాలు ఉండవు , చిన్న పెద్ద అనే బేధం అస్సలే ఉండదు , పేదవాడికి , ధనికుడికి అందరికి బంధువు ఈ ఆవకాయ వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరూ పచ్చళ్ళు పెట్టె బిజీ లో ఉంటారు , కానీ రుచి గా, సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి పెట్టడం అందరికి సాధ్యం అవదు , కానీ కిలోల కొలతలతో కాకుండా ఇపుడు మేము చెప్పే ఈ సులభమైన పద్దతిలో చేసి చూడండి.ఆవకాయ అనగానే బెల్లం ఆవకాయ ,మాగాయ ఇలా కొన్ని రకాలు మనకు తెలుసు ,కానీ పులిహోర ఆవకాయ పేరు విన్నారా ,చాల బాగుంటుంది మరి అదెలా చేసుకోవాలో చూద్దాం..


పులిహోర ఆవకాయ పెట్టడానికి కావాల్సినవి :

ముందుగా మామిడికాయలు తీస్కుని వాటిని శుభ్రంగా కడిగి వాటి ముచుకను తీసి ఒక అరగంటా పాటు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి సన్నగా చిన్న సైజు లో తరిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి

మామిడి ముక్కలు 

నువ్వుల పిండి 

కారం 

పొట్టు తీసిన ఆవపిండి

పొట్టు తీయని ఆవపిండి 

ఉప్పు (దొడ్డు ఉప్పు ) 

ఆవాలు 

మిరపకాయలు 

పసుపు - తగినంత 

నువ్వుల నూనె - ముక్కలు మునిగేంత


తయారు చేసే విధానం : 

ముందుగా మనం కొలత కోసం ఎదో ఒక కప్ తీస్కుని ,దానితో 3 కప్పుల మామిడి ముక్కలు తీసుకుందాం కారం - 1 / 2 కప్పు, ఉప్పు - 1 /2 కప్పు, ఆవపిండి - 1 /2 కప్పు, పసుపు - అర చెంచా వేస్కోవాలి.

ఇలా అన్ని బాగా కలిపిన మిశ్రమాన్ని ఒక రెండు గంటలు ఎండలో పెట్టి , బాగా ఊరిన తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు ఎండుమిర్చి కావాలంటే కరివేపాకు పచ్చి సెనగపప్పు కూడా వేసుకోవచ్చు, తాలింపు పెట్టాక అందులో ఆ మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. 

చివరిగా అందులో ఒక కప్పు నువ్వుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే చక్కటి సువాసనతో పులిహోర ఆవకాయ రెడీ. ముక్కలు మునిగేంత నూనె పోసుకుని బాగా కలుపుకుని జాడీలో భద్రంగా పెట్టుకుంటే సంవత్సరం వరకు ఈ ఆవకాయ పాడవకుండా నిలవ ఉంటుంది. ఈ పులిహోర ఆవకాయ , కమ్మగా , రుచి గ , చాల బాగుంటుంది. మరింకెందుకాలస్యం మీరు కూడా నోరూరించే పులిహోర ఆవకాయ పెట్టేసుకోండి మరి..

https://www.youtube.com/watch?v=JkyqPq2CK6Q


Related Recipes

Pickles

టమాట కరివేపాకు పచ్చడి

Pickles

క్యాబేజీ పచ్చడి

Pickles

నిమ్మకాయ కారం పచ్చడి

Pickles

చింతపండు, ఉల్లిపాయ చట్నీ

Pickles

టమాటో చట్నీ!

Pickles

Allam Pachadi

Pickles

Dondakaya Roti Pachadi

Pickles

Tomato Karivepaku Pachadi