Home » Sweets N Deserts » Paneer Jalebi


 

 పనీర్ జిలేబీ

 

 

 

 

కావలసిన పదార్థాలు:

పాలు - ఒక లీటరు
బొంబాయి రవ్వ - రెండు చెంచాలు
మైదా - ఒక చెంచా
నిమ్మరసం - ఒక చెంచా
మిల్క్ పౌడర్ - మూడు చెంచాలు
యాలకుల పొడి - ఒక చెంచా
బేకింగ్ పౌడర్ - చిటికెడు
నెయ్యి - ఒక చెంచా
చక్కెర - ఒకటిన్నర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

మూడు నాలుగు చెంచాల పాలలో బొంబాయి రవ్వ వేసి ఉంచాలి. మిగతా పాలను స్టౌ మీద పెట్టాలి. కాగిన తరువాత నిమ్మరసం వేయాలి. పాలు విరిగిపోయిన తరువాత ఓ పల్చని గుడ్డలో వేసి గట్టిగా కట్టి, దానిమీద బరువు పెట్టాలి. నీరంతా పోయి గట్టి పదార్థం మిగులుతుంది. దీనిని సాఫ్ట్ గా అయ్యేవరకూ చేతితో బాగా మెదపాలి. తర్వాత దీన్ని ఓ బౌల్ లో వేసి... పాలలో నానబెట్టిన బొంబాయి రవ్వ, మిల్క్ పౌడర్, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, అరచేతుల మధ్య ఉంచుకుని మెదుపుతూ, సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. తరువాత వీటిని ఫొటోలో చూపిన విధంగా చుట్టాలి. ఎక్కడా పగుళ్లు లేకుండా చూసుకోవాలి. అన్నిటినీ అలా చేసుకున్న తరువాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చక్కెరలో నీళ్లు పోసి స్టౌమీద పెట్టాలి. లేత పాకం అయ్యాక... వేయించుకున్న జిలేబీలను వేయాలి. పాకం బాగా పీల్చుకున్న తరువాత వడ్డించాలి.

 

--Sameera

 


Related Recipes

Sweets N Deserts

Gulab Jamun

Sweets N Deserts

Coconut Buns

Sweets N Deserts

Watch How to Make Panakam

Sweets N Deserts

షీర్ కుర్మా (రంజాన్ స్పెషల్)

Sweets N Deserts

Eggless Ginger Cookies (Christmas Special)

Sweets N Deserts

Chocolate Badam Halwa

Sweets N Deserts

Ravva Kesari - Dasara Special

Sweets N Deserts

Pesara Pappu Pongali Recipe